365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 27,2022: ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కార్యక్రమం షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ లో ఆదివారం ఘనంగా జరిగింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు లియోనియా రిసర్ట్స్లో జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ఆడి పాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
ప్రతినిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో కలసి యిక్కడ సంతోషంగా గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జబర్దస్త్ ఫేం కిరణ్ బలూన్ డాన్సు ఆకట్టుకుంది. అలాగే ఫోర్ లెగ్ డాన్స్, మిమిక్రీ, సర్కస్ వంటి పలు సంస్కృత కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నయి.
ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, ఫ్లెమింగో ఈవెంట్స్ నిర్వాహకులు వరద రాజన్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వారిని శ్రీనివాస్ గుప్తాతో పాటు ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం ఘనంగా సన్మానించింది.
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్ .వేణుగోపాల నాయుడు ప్రధాన కార్యదర్శి ఆర్ రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమం నిర్వహణకు అన్ని విధాల సహకరించిన మంత్రి జగదీష్ రెడ్డితో పాటు తెరాస ఎమ్మెల్యే గదరి కిషోరేకు కమిటీ తరఫున, ప్రెస్ క్లబ్ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త కార్యవర్గం నిర్వహించిన మొదటి కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రావు, వనజ, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, రమేష్ వైట్ల ,కోశాధికారి ఎ. రాజేష్ ఈసీ సభ్యులు పద్మావతి , గోపరాజు, బాపూరావు, ఉమాదేవి మర్యాద రమాదేవి ,వసంత్ కుమార్ ,టి శ్రీనివాస్ ,రాఘవేందర్ రెడ్డి ఫ్యామిలీ గెట్ టుగెదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లియోనియా లో వివిధ సాంస్కృతి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా యాంకర్ సోనీ అందరినీ ఉత్సాహ పరిచారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం తంబోలా కార్యక్రమం గెట్ టుగెదర్ లో హైలెట్ గా నిలిచింది. ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులు దాదాపు 1300 మందికి పైగా ఈ గెట్ టు గెదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామయ్య గొప్ప హీరో : జనసేనాని పవన్ కళ్యాణ్
వైసీపీని ఉగ్రవాద సంస్థగానే చూచూస్తాం..:జనసేన పార్టీ ఛీఫ్
బెదిరించి ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్నిఅపహస్యం చేశారు: జనసేన అధినేత
నన్ను ఇబ్బంది పెట్టిన వారెవరినీ మర్చిపోను: పవన్ కళ్యాణ్
”AP04 రామాపురం” సినిమా ట్రైలర్ రిలీజ్
20 రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచి రక్షించే వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు..
భవిష్యత్తులో పాల ధరలను పెంచే ఆలోచన లేదన్న అమూల్
‘ త్వరలో మరో మహమ్మారి.. పరిస్థితులు చాలా ఘోరం ఉండవచ్చు’
ఎన్‌డీటీవీ స్వాధీనంపై గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు
చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. పలుచోట్ల లాక్ డౌన్..