జి.కృష్ణవేణి, డా.హిప్నో పద్మా కమలాకర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 16,2024: భిన్నత్వంలో ఏకత్వమే కుటుంబమని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణీ అన్నారు.

అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠంలో యోగా నంద రఘుమహారాజు, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధ వారం బాలల సేవా విభాగంలో కుటుంబాలు- వాతావరణ మార్పులు పై డ్రాయింగ్ , వ్యాసరచన పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు.*

గురువారం గెలుపొందిన వారికి బహుమతులను , రంగు పెన్సిల్స్, ఫ్రీడం ఫైటర్స్, దేశభక్తి గీతాలు పుస్తకాలు ఆరతి, జి.కృష్ణవేణీ డా.హిప్నో పద్మా కమలాకర్ అందజేశారు.

వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల అందరికి అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1983లో ‘మే 15వ తేదీని అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా ప్రకటించింది న్నారు.

అన్ని బంధాలనూ సమన్వయం చేసుకొని అందరితో కలివిడిగా ఉంటూ… గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి న్నారు .ఎవరినీ కించ పరుస్తూ హేళనగా మాట్లాడొద్దు న్నారు.

దాని వల్ల మనసులు నొచ్చుకుని బంధాలు బలహీనమవుతాయని తెలిపారు. దృఢంగా, ఆత్మవిశాస్వంతో ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలన్నా కుటుంబమే ఉండాలన్నారు బంధాలను పదిలంగా కాపాడుకోవాలన్నారు. నమ్మకాలకు విలువనిస్తూనే…. కుటుంబ విలువలనూ గౌరవించాలన్నారు.

అంతేకానీ జీవితాంతం ఎదుటి వారు తప్పులను మౌనంగా భరించమని కాదన్నారు.కుటుంబం అన్నాక కొన్ని చిన్నా చితకా విషయాల్లో సభ్యులతో సర్దుకుపోవాలని చెప్పారు.

భిన్న మనస్తత్వాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, అభిరుచులు… ఉంటాయని వాటిని పంచుకుంటూ.. ఒకే తాటిపై కలిసి అడుగులేద్దామని తెలిపారు. ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే బంధాలు కలకాలం నిలుస్తాయన్నారు.

స్నేహితుడిని ఓ మాట అనడానికి ఆలోచిస్తాం. దారినపోయే దానయ్య అమర్యాదగా ప్రవర్తించినా.. అవతలి వ్యక్తి బలాబలాలు తెలుసుకొని ప్రతిస్పందిస్తాం. అదే ఇంట్లో లో మాత్రం నోటికెంత వస్తే అంత అరిచే స్తామని తెలిపారు.

మనసులో అందరం సమానం అనే భావన లేకనే.. ఆధిపత్య ధోరణికి లొంగిపోతున్నామన్నారు. అనవసరంగా జీవితాన్ని సమస్యల్లో కి నేడుతున్నామన్నారు.

తొలి వందనం కుటుంబానికే నన్నారు
గేట్‌ తీస్తూ ఇంటి లోపలికి తండ్రి అడుగు పెడుతూ ఉంటే, పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లి ‘ఒరే అన్నయ్యా’… అని పిలిచే చెల్లి పిలుపు ‘తమ్ముడూ’… అని క్రికెట్‌ బ్యాట్‌ కొనిచ్చే అన్నయ్య , ‘న్యూస్‌పేపర్‌ ఎక్కడా’ అని మనమడిని కేకేసే తాత , పూలసజ్జ పట్టుకుని మొక్కల దగ్గర తిరుగాడే జేజి కనిపించడం అందమైన కుటుంబంలో నే ఉంటాయన్నారు.

తల్లి దండ్రులు, తోడబుట్టిన వాళ్లతో తెగదెంపులు నేటి ఫ్యాషన్‌ అయ్యి పోయిందన్నారు. కుటుంబానికి విలువివ్వని మనిషి సంఘానికి ఇవ్వడన్నారు.కుటుంబం పట్ల బాధ్యత సంఘం పట్ల బాధ్యత వహించాలని సూచించారు.

కుటుంబ బంధాలు… పదిలంగా ఉంటేనే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలమన్నారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపేవారు మానసికంగా చురుగ్గా ఉంటారన్నారు.

కుటుంబం సమాజానికి వెన్నుముఖ లాంటి దన్నారు. కుటుంబాన్ని కాపాడుకోవలసిన భాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు.

Aslo read : Deesawala Rubber Industries Embarks on Major Expansion