365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 30,2024:వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పనిచేయడం ద్వారా ప్రగతి పథంలో సాగడం సాధ్యమైంది అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డాక్టర్ పి. రఘురామి రెడ్డి తెలిపారు.
ప్రతి ఉద్యోగి అంకితభావం, చిత్తశుద్ధి కలిగిన పని విధానాలను అనుసరించి, వృత్తి ,వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాల్సిందిగా ఆయన సూచించారు.
తాజాగా, PJTAUలో 28 సంవత్సరాలుగా ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేసిన K. మల్లేష్ కు నేడు ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో జరిగింది.
మల్లేష్ తన సుదీర్ఘ సేవలకు అభినందనలు తెలిపారు.ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు. ఆయన తదుపరి జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.