365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, కర్ణాటక, ఆగస్టు 4,2022: అందరిలో ఒకరిగా ఉంటే త్రిల్లేముంది. నలుగురితో నారాయణ అనుకుని కొందరు అందరితో కలిసి వాళ్ళు చేసేపని వీళ్ళు చేస్తూ ఏదో ఉన్నామంటే ఉన్నామని అనుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇతను మాత్రం అలా అనుకోలేదు తనకంటూ సపరేట్ రూట్ క్రీయేట్ చేసుకొని అదే దారిలో నడుస్తున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..?

కర్ణాటకకు చెందిన రైతు అనిల్ బలాంజా గత 20 ఏళ్లుగా తన పొలంలో 40 దేశాలకు చెందిన 700 రకాల విదేశీ పండ్లను పండిస్తు న్నాడు. అనిల్ బలాంజ తండ్రి అనేక రకాల పండ్లను సాగుచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అతనికి వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. దీంతో19 సంవత్సరాల వయస్సులో కొత్తరకం పండ్లను పండించడం మొదలు పెట్టాడు.
అనిల్ బలాంజ తండ్రి మనదేశంలో దొరికే జామ,మామిడి వంటి పండ్లను మాత్రమే పండించేవాడు. కానీ అనిల్ బలాంజ అలా కాకుండా కొత్త పంటలను సాగుచేయాలనుకున్నాడు. అందుకోసమే దేశంలో అరుదుగా పండే వివిధ రకాల విదేశీ పండ్లను తన పొలంలో సాగుచేయడం మొదలు పెట్టాడు. అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, వంటి విదేశీ పండ్లని పండిస్తున్నాడు.

ప్రస్తుతం దక్షిణ-కన్నడ జిల్లాలో ఉన్న అనిల్ వ్యవసాయ క్షేత్రంలో 40 దేశాల నుంచిసేకరించిన 700 పైగా విదేశీ పండ్లు పండుతున్నాయి. విదేశాలలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడి నర్సరీల నుంచి ఆయా పండ్ల విత్తనాలను, మొక్కలను తెప్పించాడు. ఆయా పండ్ల మొక్కలు పెరగడానికి ఎలాంటి వాతావరణం అవసరం అనే విషయాలు తెలుసుకున్నాడు. అవిపెరగడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత, నేలను బట్టి మొక్కలను సాగుచేయడం మొదలు పెట్టాడు.

రైతు తన 30 ఎకరాల పొలంలో పలురకాల పండ్ల రకాలను విత్తనాలు లేకుండా పండిస్తున్నాడు. ప్రస్తుతం తాను పండించిన పండ్లను లోకల్ మార్కెట్లలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాడు. ఇతర రైతులకు సైతం విదేశీ పండ్లను సాగుచేసే విధానాలను గురించి చెబుతూ అరుదైన పండ్లను అందరికీ అందిస్తున్నాడు.