365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం, జూన్ 4,2025: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని వెంకటాపురం, జమలాపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూముల సమస్యలపై రైతుల నుంచి భారీగా అర్జీలు అందాయి.

తమ భూములకు సంబంధించిన సమస్యలు, సమస్యాత్మక పత్రాలు, రెవెన్యూ సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరుతూ రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.

వెంకటాపురం గ్రామంలో 64 అర్జీలు, జమలాపురం గ్రామంలో 39 అర్జీలు రైతుల నుంచి అందినట్లు తహసిల్దార్ ఉషా శారద తెలిపారు. అర్జీలను స్వయంగా స్వీకరించిన అధికారులు, వీటిపై త్వరితగతిన పరిశీలించి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

Read This also…RCB vs PBKS Face Off in IPL 2025 Final Tonight..

ఇది కూడా చదవండి…హ్యుందాయ్ కొత్త ప్రచారం: పంకజ్ త్రిపాఠి తో ‘లిజన్ టు యువర్ దిల్ ఆర్ ది డీల్స్’..

ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, యూడీసీ శిరీష, వెంకటాపురం గ్రామ సెక్రటరీ శ్రీలక్ష్మి, గ్రామ పెద్దలు గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను అధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం ఈ సదస్సుల ద్వారా కలిగిందని రైతులు అభిప్రాయపడ్డారు.