365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మంగళగిరి, జూలై 4,2025 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తమ పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు.

ఇది కూడా చదవండి…హిందూ మహాసముద్రంలో వింత ‘గురుత్వాకర్షణ రంధ్రం’: శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు.. !

నివాసానికి చేరుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో పలు ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

చర్చల అనంతరం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్కాపురం నియోజకవర్గ పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.