365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ జూన్18,2022:ఫాదర్స్ డే USAలో వాషింగ్టన్ YMCAలోని స్పోకేన్‌లో 1910లో సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రారంభించింది. మొదటిసారి ఫాదర్స్ డే జూన్ 19, 1910న జరుపుకున్నారు. అన్నా జార్విస్ తన తల్లి గౌరవార్థం మదర్స్ డేని ఎలా స్థాపించారో సోనోరా విన్నది. అదేవిధంగా తండ్రులను కూడా గౌరవించు కోవాలని భావించి ఫాదర్స్ డే ని మొదలు పెట్టింది. తండ్రుల ప్రత్యేక పాత్రను గుర్తించడానికి యూరోపియన్ దేశాలు సెయింట్ జోసెఫ్స్ డేని ఫాదర్స్ డేగా జరుపుకుంటాయి. వేడుకల వెనుక కథ సెబాస్టియన్ కౌంటీ, అర్కాన్సాస్, 1982 నాటిది, సోనోరా స్మార్ట్ డాడ్ తల్లి 16 సంవత్సరాల వయస్సులో మరణించింది.
డాడ్ తండ్రి, విలియం స్మార్ట్ ఆమెను,ఆమె ఐదుగురు సోదరులను పెంచి పెద్ద చేశారు. తన తండ్రి నిస్వార్థ ప్రేమను గౌరవించడం కోసం డాడ్ తన తండ్రి పుట్టినరోజును ఫాదర్స్ డే పేరుతో జరుపుకోవాలని భావించింది. జూన్ 5 న ఆమె తండ్రి పుట్టినరోజు అయితే, ఆ రోజును జూన్ మూడవ ఆదివారం రోజున బర్త్ డే ను మార్చింది. అప్పటి నుంచి పితృ దినోత్సవంగా జరుపడం ప్రారంభమైంది.
జూన్ మూడవ ఆదివారాన్ని అమెరికాలో ఫాదర్స్ డేగా జరుపు కుంటుండగా భారతదేశంలో దీనిని అదే రోజున అనుసరిస్తుండగా, పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ మొదలైన అనేక ఇతర దేశాలు మార్చి19న ఫాదర్స్ డేని జరుపుకుంటాయి. ఇది ప్రధానంగా పాశ్చాత్య సంప్రదాయం అయినప్పటికీ, ఫాదర్స్ డే వేడుకలు భారతదేశంలో నేకాకుండా ప్రపంచంలోని అనేకదేశాల్లో కూడా చాలా ప్రాముఖ్యత పొందింది.