365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,14 జూన్, 2023: ఫాదర్స్ డే సందర్భంగా వండర్ లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు టికెట్లను కొనుగోలు చేస్తే మరొక టికెట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను https://bookings.wonderla.com/పొందవచ్చు.
జూన్18తేదీన ఫాదర్స్ డే ను పురస్కరించుకుని స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది వండర్ లా హాలిడేస్ లిమిటెడ్. “2+1” ఆఫర్‌ను అందజేస్తుంది వండర్‌లా. ఈ ఆఫర్ ద్వారా మొత్తం ఫ్యామిలీకి మధురానుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది.
మూడు టిక్కెట్‌లను కొనుగోలు చేసిన అతిథులు, రెండు టిక్కెట్‌లకు మాత్రమే చెల్లించాలి. మూడవ టిక్కెట్ వారి తండ్రికి పూర్తిగా ఫ్రీగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ బెంగళూరు, హైదరాబాద్ , కొచ్చిలోని వండర్ లా మూడు పార్కులలో అందుబాటులో ఉంది. జూన్ 18వ తేదీన మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ.. “తండ్రీ, పిల్లల బంధం మాటల్లో చెప్పలేము, అపూర్వమైన, అసాధారణమైన అనుబంధంవారిది. వండర్‌లాలో మేము ఆ బంధాలను గౌరవిస్తూ ఫాదర్స్ డేని జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశాము.
ఈ స్పెషల్ ఆఫర్ తండ్రులు నిస్వార్థంగా ఇచ్చే ప్రేమ, మార్గదర్శకత్వం, మద్దతును, చిరకాల జ్ఞాపకాలను గౌరవిస్తున్నవేళ ఆ అమూల్యమైన జ్ఞాపకాలను కలిసి స్మరించుకోవడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది..” అని ఆయన అన్నారు.
వండర్ లా తమ ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా ముందుగానే టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.wonderla.com/offers/wonderla ని సందర్శించవచ్చు.
బెంగళూరు: +91 80372 30333, +91 80350 73966
హైదరాబాద్: 0841 4676333, +91 91000 63636
కొచ్చి: 0484-3514001, 7593853107..ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు.