365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 26,2021:సినిమా పరిశ్రమకు అత్యంత ఫేవరెట్ అయిన ఎఫ్3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ సమీపంలో ఆదివారం ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు దిల్ రాజు గారు,శిరీష్ రెడ్డి గారు, ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి గారు, గోపీచంద్ మలినేని గారు లాంటి దిగ్గజాల సమక్షంలో ఇది ప్రారంభం కావడం విశేషం. ఈ కొత్త బ్రాంచి 2వేల చదరపు అడుగుల విశాల ప్రదేశంలో, అత్యంత అధునాతన పరికరాలతో కస్టమర్లు ముందెన్నడూ చవిచూడని సరికొత్త అనుభవాలనిస్తుంది.
గత కొన్నేళ్లుగా ఎఫ్3 సురేష్‌గా ప్రాచుర్యం పొందిన సురేష్ నడిపిస్తున్న ఎఫ్3 సెలూన్లు సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అందరికీ హాట్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. అత్యంత అధునాతన హెయిర్ స్టైళలు, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు పూర్తిస్థాయి సంతృప్తిని ఎఫ్3 సెలూన్లు అందిస్తున్నాయి. ఇందులో అపార అనుభవం, మెళకువలు ఉన్న సిబ్బంది పనిచేస్తున్నారు.
కొత్త బ్రాంచి ప్రారంభం సందర్భంగా ఎఫ్3 సెలూన్ల యజమాని, వ్యవస్థపకుడు ఎఫ్3 సురేష్ మాట్లాడుతూ,“హైదరాబాద్ లాంటి మెట్రోనగరాల్లో పేజ్-3 జనాలకు మంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిస్టులు కావాలి. వాళ్లకు అత్యంత ఆధునిక స్టైళ్లు చేయాలి.మంచి పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్‌లో శిక్షణ పొందాను, ఎఫ్3 సెలూన్‌లో ఉన్న సిబ్బంది అందరూ అత్యుత్తమ నాణ్యత కలిగిన సేవలు అందించడానికి తగిన శిక్షణ పొందినవారే” అన్నారు.
హైటెక్ సిటీ సమీపంలో ఎఫ్3 సెలూన్ కొత్త బ్రాంచిని ప్రారంభించిన సందర్భంగా పలువురు అగ్రశ్రేణి నటులు, నటీమణులు సురేష్‌కు అభినందనలు తెలిపారు. మెహరీన్ పీర్‌జాదా ఒక వీడియో సందేశంలో తనకు ఎంతగానో నచ్చిన ఎఫ్3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ సమీపంలో రావడం ఆనందకరమని చెబుతూ, సురేష్‌కు అభినందనలు చెప్పారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారంతా ఈ కొత్త బ్రాంచి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.