365తెలుగు డాట్ కామ్,ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 30, హైదరాబాద్, 2020: టాలీవుడ్ లోకి ఫిలిమ్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ రోబోతోంది. ఫిలిమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఫిలిమ్ ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇతర ఓటీటీలతో పోల్చితే ఫిలిమ్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయని ఈ ఓటీటీ చెబుతోంది. కొంతమంది యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ కలిసి ఫిలిమ్ ఓటీటీని తీసుకొస్తున్నారు. విజయదశమి పండగ ముందు ఫిలిమ్ ఓటీటీ లాంఛ్ అవుతోంది.
“ఫిలిమ్” ఓటీటీలో విజయ్ సేతుపతి నటించిన “పిజ్జా 2”, మమ్ముట్టి నటించిన “రంగూన్ రౌడీ”, ప్రియమణి “విస్మయ” వంటి అనేక ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీ లు ప్రీమియర్ కానున్నాయి. “ఫిలిమ్” ఓటీటీలో విజయ్ సేతుపతి “పిజ్జా 2” సినిమా తొలి చిత్రంగా ప్రీమియర్ కానుంది. పిజ్జా 2 సినిమాను దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించారు. గాయత్రి నాయికగా నటించింది. సోనియా దీప్తి, మహిమా నంబియార్ ఇతర పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన పిజ్జా 2 ఫిలిమ్ ఓటీటీలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది.
ఈ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వాటి విడుదల తేదీలు, పాటలు, టీజర్, ట్రైలర్స్ అన్నీ “ఫిలిమ్” యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉంటాయి.