Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 24,2024: కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న ప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రతి చీర భారతదేశంలోని వివిధప్రాంతాల నుంచి విభిన్న సాంస్కృతిక కథను సూచిస్తుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించి చిన్న సూచనలు కూడా వీటిలో ఉన్నాయి.

మంగళవారం నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్ వారసత్వాన్ని చాటిచెప్పే మెజెంటా బార్డర్‌తో కూడిన తెల్లటి మంగళగిరి చీరను ధరించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించడం గమనార్హం. దీర్ఘకాలంగా జాప్యం చేస్తున్న పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేసి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అవసరాలకు ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది.

ఫిబ్రవరి 2024 కోసం మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రి పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంటా కుట్లు ఉన్న చీరను ధరించారు. చీర బెంగాల్‌లోని పురాతన, అత్యంత ప్రసిద్ధ చిత్రమైన ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఉత్పత్తిని పెంచడానికి ఆ బడ్జెట్‌లో ప్రతిపాదించిన పథకాలకు నీలిరంగు చీర సూచిక అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

నిర్మల 2023 బడ్జెట్ ప్రెజెంటేషన్‌లో ధరించడానికి కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతం నుంచి ఎరుపు రంగు ఇల్కల్ కసూటి చీరను ఎంచుకుంది. ఈ నేసిన చీర కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వాన్ని సూచిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.

2022లో నిర్మల ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన గోధుమరంగు బొమ్మకై చీరను ధరించింది. ఒడిశాకే ప్రత్యేకమైన చేనేత పరిశ్రమకు ఇదో ప్రోత్సాహకరం అని మెర్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేకమైన చేనేత సంప్రదాయాన్ని ప్రోత్సహించేందుకు నిర్మల 2021లో హైదరాబాద్‌లోని పోచంపల్లి గ్రామానికి చెందిన తెల్లటి పోచంపల్లి చీరను ధరించారు.

2020లో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, నిర్మలా సీతారామన్ బడ్జెట్ పత్రాలను ఎరుపు రంగు ఫైల్‌లోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత జరిగిన అన్ని బడ్జెట్‌ సమర్పణల్లోనూ ఆర్థిక మంత్రి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మూడేళ్ల క్రితం బడ్జెట్ పేపర్ నుంచి ట్యాబ్లెట్‌లకు మారినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులను క్లాత్‌తో చేసిన ఫైల్‌లోనే తీసుకువచ్చారు.

2024లో తన వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి రూ.15,000 కోట్ల మద్దతు లభిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధికి ప్రీ-బడ్జెట్ సమావేశంలో రూ. 15,000 కోట్లు కోరిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన డిమాండ్‌ను ఈ ప్రకటన ప్రస్తావిస్తుంది.

బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని డిమాండ్‌ను కేంద్రం గుర్తిస్తుందని, బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా సహకారం అందిస్తుందని సీతారామన్ పేర్కొన్నారు. ఏడు బడ్జెట్‌లలో నిర్మల ధరించిన ఏడు చీరలు భారతదేశ వైవిధ్యం, సంప్రదాయాన్ని హైలైట్ చేశాయని,సమర్పించిన ప్రాజెక్ట్‌ల గురించి చిన్న సూచనలు కూడా ఇచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

error: Content is protected !!