365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం 9సెప్టెంబర్ 2020: “ఖమ్మం కాప్స్ రాక్స్ “సభ్యులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన కుంచల మల్లికార్జున్ కు ఆర్ధిక సాయం అందించి తమ ఉదారతను నిరూపించుకున్నారు.”ఖమ్మం కాప్స్ రాక్స్ “ఆధ్వర్యంలో కరోనా బుధవారం బాధితుని కుటుంబ సభ్యులకు రూ .9,300 ఆర్ధిక సాయాన్ని అందజేశారు.కుంచల మల్లికార్జున్ కు కోవిడ్ -19 రావడంతో ఆర్థికంగా వారి కుటుంబం ఇబ్బంది పడుతుందనే విషయం తెలుసుకున్న “ఖమ్మం కాప్స్ రాక్స్ “అడ్మిన్స్ వెంటనే “ఖమ్మం కాప్స్ రాక్స్ ” గ్రూప్ సహాయం కోరారు. దీంతో కొంతమంది గ్రూప్ సభ్యులు తమవంతుగా కొంత మొత్తాన్ని అందించారు. వారందించిన మొత్తం రూ.9,300 మల్లికార్జున్ సతిమణికి అందించారు.