Fri. Nov 8th, 2024
TPL-season-4

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, పూణె, 12 డిసెంబర్,2022: ఈసారి వినోదాన్ని పంచుతూ రెండు సెమీ ఫైనల్స్‌ జరగ్గా, లాస్ట్ ఇయర్ ఫైనల్స్‌ మరోమారు మరింత ఉద్విగ్నభరితంగా ఈ సీజన్‌లోనూ రిపీట్ అయ్యాయి. మొదటి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్, చెన్నై స్టాలియన్స్‌ మధ్య జరిగింది.

10–10తో డ్రా..

ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్ని పెర్రిన్‌, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరీనా కజియోనోవాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్‌ 10–10తో డ్రాగాముగిసింది. ఆ తరువాత మ్యాచ్‌ మెన్స్‌ సింగిల్స్‌గా జరిగింది.

ఆ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌‌కు చెందిన నిక్కీ పూనాచా, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథియాస్‌ బౌర్గీపై 13–7తో విజయం సాధించారు.

13–7తో విజయం..

TPL-season-4

ఈ మ్యాచ్‌ అనంతరం మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్ చెందిన శ్రీరామ్‌ బాలాజీ , కొన్నీ పెర్రిన్‌లు చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరినా కజియోనోవా, అనిరుద్‌ చంద్రశేఖర్‌ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ 13–7తో విజయం సాధించింది.

48–32 పాయింట్లతో..

ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ తమ విజయ పరంపర కొనసాగిస్తూ మెన్స్‌ డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ, నిక్కీ పూనాచాలు చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథయాస్‌ బౌర్గీ, అనిరుధ్‌ చంద్రశేఖర్‌పై 12–8తో విజయం సాధించారు.

ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ 48–32 పాయింట్లతో చెన్నై స్టాలియన్స్‌పై పూర్తి ఆధిపత్యం చూపడంతో పాటుగా ఫైనల్స్‌లో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ ప్రవేశించింది.

రెండవ సెమీ ఫైనల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీ, బెంగళూరు స్పార్టన్స్‌తో పోటీపడింది. బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన కర్మాన్‌ కౌర్‌ థండి, ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన ఆకాంక్ష నిట్టర్‌పై 13–7స్కోర్‌తో మహిళల సింగిల్స్‌లో విజయం సాధించింది.

మెన్స్‌ సింగిల్‌ విభాగంలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌, బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్‌ రావత్‌పై 11–9 స్కోర్‌తో విజయం సాధించాడు.

TPL-season-4

మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన జీవన్‌ నెడుం చెంజియాన్‌, ఆకాంక్ష నెట్టూరిలు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన విష్ణు వర్ధన్‌, కర్మాన్‌కౌర్‌లతో పోటీపడ్డారు. ఈ పోటీలో 12–8 స్కోర్‌తో బెంగళూరుపై ముంబై విజయం సాధించింది.

మెన్స్‌ డబుల్స్‌ పోటీలలో..

మెన్స్‌ డబుల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌, జీవన్‌ నెడుం చెంజియాన్‌లు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్‌ రావత్‌, విష్ణు వర్ధన్‌‌పై 11–9 స్కోర్‌తో విజయం సాధించారు. ముంబై లియాన్‌ ఆర్మీ 41–39 స్కోర్‌తో ఫైనల్స్‌లో ప్రవేశించారు.

ఫైనల్స్‌ పోటీలు ముంబై లియాన్‌ ఆర్మీ, ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ సై్ట్రకర్స్‌ మధ్య జరగడంతో సీజన్‌ 3 ఫైనల్స్‌ను గుర్తు చేసింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో మ్యాచ్‌ తొలుత జరిగింది.

ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెరిన్‌, ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన ఆకాంక్ష నిట్టర్‌తో తలపడ్డారు. ఈ మ్యాచ్‌ 13–7తో కొన్నీపెర్రిన్‌ విజయం సాధించారు.

ఈ మ్యాచ్‌ అనంతరం మెన్స్‌ సింగిల్‌ విభాగపు పోటీలు జరిగాయి. దీనిలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌తో పోటీపడ్డారు. ఈ పోటీలో నిక్కీ పూనాచా 12–8తో విజయం సాధించారు. ఆ తరువాత మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు జరిగాయి.

13–7 స్కోర్‌తో ముంబై లియాన్‌ ఆర్మీ..

TPL-season-4

ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ సై్ట్రకర్స్‌ తరపున శ్రీరామ్‌ బాలాజీ, కొన్నీ పెర్రిన్‌ పోటీపడగా, ముంబై లియాన్‌ ఆర్మీ తరపున జీవన్‌ నెడుంచెంజియాన్‌, ఆకాంక్ష నెట్టూరి పోటీపడ్డారు. ఈ మ్యాచ్‌ 13–7 స్కోర్‌తో ముంబై లియాన్‌ ఆర్మీ గెలిచింది. ఆ తరువాత విభాగపు పోటీలుగా మెన్స్‌ డబుల్స్‌ జరిగాయి.

నిక్కీ పూనాచా, శ్రీరామ్‌ బాలాజీలు ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ తరపున పోటీపడగా, రామ్‌కుమార్‌ రామనాథన్‌, జీవన్‌ నెండుంచెంజియాన్‌ ముంబై లియాన్‌ ఆర్మీ తరపున పోటీపడ్డారు. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ 14–6తో విజయం సాధించింది.

ఛాంపియన్‌గాఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌..


ఫైనల్‌ స్కోర్‌ 41–32 కాగా ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ విజేతగా నిలిచింది. తద్వారా ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ సై్ట్రకర్స్‌ తమ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ నిలబెట్టుకుంది. వరుసగా టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ టైటిల్‌ హైదరాబాద్‌ గెలుచుకుంది. అత్యంత ఉత్సాహ పూరితమైన సీజన్‌ 4 టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ను 1ఎక్స్‌ బ్యాట్‌ స్పాన్సర్‌ చేయగా ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ గ్రాస్‌రూట్‌ లీగ్‌గా టీపీఎల్‌ ప్లస్‌ జరిగింది. దీనిద్వారా యువ టెన్నిస్‌ అథ్లెట్లు అంతర్జాతీయ మరియు భారతీయ స్టార్ల నుంచి నేర్చుకునే అవకాశం కలుగింది. ఈ అవార్డును ముంబై లియాన్‌ ఆర్మీ విజయం గెలుచుకుంది.

TPL-season-4
  • యజమాని: బ్రిజ్ భూతాడ (MD ఫైన్‌క్యాబ్ వైర్లు & కేబుల్స్) & గౌరవ్ భూతాడ.
  • సహ యజమాని: రకుల్ ప్రీత్ సింగ్
  • సహ యజమాని: అనూప్ చందక్
  • టైటిల్ స్పాన్సర్: గురునానక్ యూనివర్సిటీ
  • స్పాన్సర్ ద్వారా ఆధారితం: ఫైన్‌క్యాబ్ వైర్లు & కేబుల్స్
  • ఇతర స్పాన్సర్‌లు: సనిష్ జ్యువెల్స్, పరాస్ – రిఫైండ్ ఎడిబుల్ ఆయిల్
  • మెంటర్/కోచ్: సురేష్ కృష్ణ సర్
  • ప్రొఫెషనల్ ప్లేయర్స్ @శ్రీరామ్ బాలాజీ @నికి పూనాచా @కానీ పెర్రిన్

పాల్గొనే జట్లు..
పూణే జాగ్వార్స్
ముంబై లియోన్ ఆర్మీ
ఫైన్‌క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్
చెన్నై స్టాలియన్స్
పంజాబ్ టైగర్స్
గుజరాత్ పాంథర్స్
ఢిల్లీ బిన్నీ బ్రిగేడ్
బెంగళూరు స్పార్టాన్స్

TPL-season-4

ప్రముఖులు/సహ యజమానులు
రకుల్ ప్రీత్ సింగ్ – హైదరాబాద్
సోనాలి బింద్రే – పూణే.
నోరా ఫతేహి – ఢిల్లీ
లియాండర్ పేస్ – ముంబై
సానియా మీర్జా – బెంగళూరు
తాప్సీ పన్ను – పంజాబ్

error: Content is protected !!