Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 26,2022:సూపర్ స్టార్ రణవీర్ సింగ్ యశ్ రాజ్ ఫిలింస్ వారి జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో నటిస్తుండగా ,ఇది భారతీయ సినిమారంగంలో అరుదైన హీరో,హీరోయిజాలకు సరికొత్త బ్రాండ్‌ను భారీ తెరపై ప్రదర్శించనున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నిన్న, రణవీర్ జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లోని మొదటి పాట- ఫైర్‌క్రాకర్‌ను ముంబైలోని ఒక కళాశాలలో అభిమానుల సందడి,ఉత్సాహం మధ్య నిన్న విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి స్టైల్‌గా వచ్చిన రణ్‌వీర్, ఎంతో ఉత్సాహంగా వచ్చిన కళాశాల విద్యార్థులతో కలిసి వారి హృదయాలు స్పందించేలా డ్యాన్స్ చేశారు.

కార్యక్రమం ముగింపులో రణ్‌వీర్ షోమ్యాన్‌గా ఉన్నందుకు విద్యార్థుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు. అతను తన నటనతో అందరినీ ఆకట్టుకు న్నారు. ఈ పాట అందరికీ చేరుకోనుంది,రణ్‌వీర్ ఈ పాటలో తన మనోహరమైన ఐటమ్ బాయ్ అవతారంతో ఇంటర్నెట్‌లో రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.తాను నటించిన చిత్రాలంటన్నిటిలో ఫైర్‌క్రాకర్ మరపురాని పాట అని రణ్‌వీర్ థ్రిల్‌గా చెప్పారు! దీని గురించి ఆయన మాట్లాడుతూ, “మీరు ఆడియోను సరైన స్థాయిలో ఆలకించినప్పుడు మీకు తక్షణమే గుర్తుకు వచ్చే కొన్ని పాటలు ఉంటాయి,వాటిలో ఒకటిగా ఫైర్‌క్రాకర్ కచ్చితంగా చేరనుంది. మనీష్ ఈ పాటను నాకు వినిపించినప్పుడు, అతను నా అంచనాలను పెంచాడు – ఓ మై గాడ్, విశాల్-శేఖర్ దానికి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు.

దీంతో మీరు అద్భుతమైన పాటను వినే అవకాశం దక్కింది! కనుక, నేను దీనిపై ఇప్పటికే పలు అంచనాలు పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న అంచనాలను ఇది ఎప్పుడో అధిగమించింది. నేను వావ్ అనడం మినహా మరేం చెప్పలేకపోతున్నాను! ఇది స్మాష్ హిట్” అని వ్యాఖ్యానించారు.బెఫికర్ నుంచి తన చార్ట్‌బస్టర్ నాషే సి చఢ్ గయీ విన్నప్పుడు తనకు ఇటువంటి స్పందనే ఉండేదని రణ్‌వీర్ వెల్లడించారు! దీని గురించి మాట్లాడుతూ, “ఆది (ఆదిత్య చోప్రా) నన్ను నషే సి చఢ్ గయీని వినిపించినప్పుడు, అలీ నాకు ట్యూన్ మారి ఎంట్రీయన్‌ని వినిపించినప్పుడు నేను
స్పందించిన విధానం నాకు గుర్తుంది. మొదటి 20 నుంచి 30 సెకన్లలో మీరు పాటతో మమేకం అవుతారు. నాకు ఫైర్‌క్రాకర్ విషయంలో అదే జరిగింది. ఇది నాకు తక్షణమే హిట్ అనిపించింది’’అని చెప్పారు.

దీని గురించి మరింత వివరిస్తూ, “ఇది విజయవంతమైందని ప్రజల స్పందనతో రుజువు చేస్తోంది. వారి స్పందనకు మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సాహిత్యపు కచ్చితమైన వివరణ ఏమిటంటే, ఒక తండ్రి తన కుమార్తె గురించి ఇలా పాడుతున్నాడు,ఇది ఒక మనోహరమైన భావ వ్యక్తీకరణ అని నేను భావిస్తున్నాను. పాట పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను,దానికి ప్రశంసలు లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.సమాజంపై ఉల్లాసమైన సెటైర్- మనీష్ శర్మ నిర్మించిన జయేశ్‌భాయ్ జోర్‌దార్‌లో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా నటించారు. ఆమె రణవీర్ సరసన నటిస్తూ బాలీవుడ్‌లో పెద్ద తెరపై మొదటిసారి కనిపిస్తోంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు దివ్యాంగ్ థక్కర్ దర్శకత్వం
వహించారు,మే 13, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

error: Content is protected !!