365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 28,2024: జోజు జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా ‘పణి ‘ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి  చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , రివేంజ్ డ్రామాగా అలరించబోతోంది. 

జోజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. ఈ చిత్ర కథానాయకుడు కూడా ఆయనే. జోజు నుంచి చిత్రాలు కోరుకునే వారు ఈ ఫస్ట్ లుక్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అభినయ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు. మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తయ్యాక థియేటర్స్ లోకి రానుంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తన 28 ఏళ్ళ సినీ కెరీర్ లో జోజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. జోజు జూనియర్ ఆర్టిస్ట్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన పేరు ముందు డైరెక్టర్ అనే పదం చేరబోతోంది. జోజు నటుడిగా కార్తీక్ సుబ్బరాజ్, సూర్య చిత్రంతో పాటు బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అనురాగ్ కశ్యప్ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు.

Also read :Get Ready for the 14th Edition of the ‘Wardrobe Refresh Sale’ on Amazon Fashion from 31st May till 5th June 2024

ఇది కూడా చదవండి : Realme GT 7 Pro త్వరలో ప్రారంభం కానుందని స్వయంగా సమాచారం ఇచ్చిన బ్రాండ్ వైస్ ప్రెసిడెంట్ చేజ్ జు

Also readInstant loan within a minute, against policy is now possible with TATA AIA Life Insurance

Also readBajaj Allianz Life continues to deliver on its Customer First promise in FY24

Also readIndia Takes Centre Stage: Škoda Auto Volkswagen India Celebrates Engine & Vehicle Production Milestones

ఇది కూడా చదవండి : చార్‌ధామ్ యాత్ర 2024: మీరు చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారా..?