Fri. Nov 8th, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 14,2023: కేరళలో నిపా వైరస్ నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటికే ఐదుకేసులు నమోదయ్యాయి. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు తొమ్మిదేళ్ల చిన్నారి పరిస్థితి ఈ వైరస్ కారణంగా చాలా క్లిష్టంగా ఉంది. ఆమెకు వెంటిలేటర్ పై ఉంచారు.

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, కోజికోడ్ తోపాటు ఇతర పరిసర ప్రాంతాల్లోని అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం బుధవారం ఆదేశించింది.

ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న 76 మందిని కూడా పరీక్షించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

ఈ అంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రజలందరూ నిరంతరం కృషి చేయాలని వైద్యుల బృందం తెలిపింది. నిపా కేసులు పెరుగుతున్నందున సమీప రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!