365తెలుగు డాట్ కామ్, ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, 10 జూన్ 2021: ఆంధ్ర ప్రదేశ్ ,తమిళనాడు ప్రభుత్వాలకు మొత్తం 210 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు,680 ఆక్సిజన్ సిలిండర్లను అందించడం ద్వారా తమ కొవిడ్-19 సహాయక చర్యలను చేపట్టామని ఫ్లెక్స్
ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 నివారణ సహకారానికి ఫ్లెక్స్ ఇండియా లాభాపేక్షలేని భాగస్వామి యునైటెడ్ వేతో కలిసి
పనిచేస్తోంది. అంతేకాదు అదనంగా, ఫ్లెక్స్ సంస్థ తాము తయారు చేసిన 10,000 ఫేస్ మాస్కులను ప్రతి రాష్ట్రానికి అందిస్తోంది.
తమిళనాడులో, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఒమన్‌ధూరర్ ప్రభుత్వ ఆసుపత్రి, చెంగల్‌పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల
ఆసుపత్రి, కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రి, తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి , హిందూ మిషన్ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేయనుంది.ఆంధ్రప్రదేశ్‌లో, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ,మచిలిపట్నం కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వనున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ (SIPCOT) ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకుఅందించనున్నారు.
‘‘ఫ్లెక్స్‌లో మేము మన సముదాయాలకు మద్ధతు ఇచ్చేందుకు , మహమ్మారి ప్రభావిత ప్రాంతాల్లో సహాయకార్యక్రమాలను నిర్వహించేందుకు ,పరిస్థితులను నేవిగేట్ చేసేందుకు, ప్రతిస్పందించేందుకుఆయా సంస్థల భాగస్వామ్యంలో సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాము. మహమ్మారితో తమ ప్రియమైనవారిని కోల్పోయిన ప్రజలందరికీ అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాము. అవసరమైన సమయంలోకీలకమైన వైద్య పరికరాలను అందించడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజాలకు సేవ చేయడం, మద్ధతుఇచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని’’ ఫ్లెక్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ శేకరన్ లట్చుమనన్ తెలిపారు.