365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ఏప్రిల్ 20, 2022: ఇండియాలో-పుట్టి పెరిగిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్, డిజిటల్ బి2బి మార్కెట్ ప్రదేశమైన ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్, తన సభ్యుల కొరకు పొదుపు పెంపొందించడానికి తన ఫ్లాగ్‌షిప్ ప్రచారోద్యమం ‘వ్యాపారీ దివస్’ ను ప్రారంభిస్తున్నట్లుగా నేడు ప్రకటించింది. ‘వ్యాపారీ దివస్’ 2022 ఏప్రిల్ 18 నుండి 24 వరకూ అన్ని స్టోరులు,ఆన్‌లైన్ ఛానల్స్ యందు లైవ్ ఉంటుంది.‘కనీ వినీ ఎరుగని ఆఫర్లు’ అనే ట్యాగ్‌లైన్ తో, ఈ ప్రచారోద్య మం ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ సభ్యులు ఎక్కువ ఆదా చేసుకుని,తమ ఎదుగుదల, లాభాలను మరింతగా పెంచుకునే వీలును కల్పిస్తూ అనేక విభాగాల వ్యాప్తంగా వారికి వివిధ విస్తృత రకాల ఆఫర్లను అందజేయడానికి సంకల్పించింది.
ప్రచారోద్యమం,ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్సీనియర్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ శ్రీ ఆదర్శ్ మీనన్ గారు, “మేము చేసే ప్రతి పనిలోనూ కిరాణా లు,చిన్న,మధ్యతరహా వ్యాపార ప్రతిపత్తులతో సుస్థిరమైన వ్యాపారాన్ని నిర్మించుకోవ డంపై ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ దృష్టి సారించింది. వారి ఎదుగుదల,శ్రేయస్సును సక్రియపరచడమే మా నిరంతర ప్రయత్నంగా ఉంది. వ్యాపారీ దివస్,అత్యంత తాజా ఎడిషన్ ప్రారంభించడం పట్ల మేము అమితానందముతో ఉన్నాము, అది చిన్న చిల్లర వ్యాపారులు, కిరాణా కొట్లు,చిన్న,మధ్యతరహా వ్యాపార ప్రతిపత్తులు గణనీయ మైన లాభాలు పొంది తద్వారా వారి అమ్మకాలు,లాభదాయకతను పెంచుతుంది” అన్నారు.
ఈ ప్రచారోద్యమం ధమాకా సేల్స్, బ్యాస్కెట్ ఆఫర్, బిల్ బస్టర్ ఆఫర్లు, హ్యాట్-ట్రిక్ ఆఫర్ (VD100 కూపన్) మరెన్నో అటువంటి అనేక ప్రత్యేకమైన,అద్భుతమైన డీల్స్ తో రూపొందించబడింది, అది ఇంకా పలు స్థాయిల్లో ఆఫర్లను కలిగి ఉంటుంది. ఇది ఇంటివాడుక సరుకులు, వ్యక్తిగత సంరక్షణ, ఇంటి సంరక్షణ, ప్యాకేజ్ చేయబడిన ఆహారాలు,పానీయాలు,ఇతర సాధారణ వ్యాపార వస్తువుల వంటి అనేక విభాగాల
వ్యాప్తంగా ఉత్పత్తులను కలిగి ఉంటుంది, ఇందులో సభ్యులు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందగలుగుతారు.ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్ ,టెక్నాలజీ నైపుణ్యము,లోతైన మార్కెట్ అవగాహన, కిరాణా కొట్లు,చిన్నమధ్యతరహా వ్యాపార ప్రతిపత్తులకు ఒక సంపూర్ణమైన,అర్థవంతమైన ఎదుగుదల వ్యవస్థకు వీలు కలిగిస్తుంది. ఈ వేదిక ,విస్తృతమైన నెట్‌వర్క్ ద్వారా ఎస్.ఎం.ఇ బ్రాండులు దర్శనీయతను సాధిస్తాయి ,భారతదేశ వ్యాప్త మార్కెట్ ప్రదేశాన్ని ప్రాప్యత చేసుకుంటాయి. దీని డిజిటల్-ఫస్ట్ చేరువ విధానముతో, ఈ వేదిక అనేక విలువ-జోడింపులను కూడా అందిస్తుంది, అవి చిన్న బ్రాండులు సూచిత వ్యాపార నిర్ణయాలు చేయడానికి సహాయపడతాయి.
వ్యాపారీ దివస్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఇక్కడ సందర్శించండి.