365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 25,2025: ఫ్లిప్కార్ట్ హోల్సేల్ తమ వార్షిక ఫ్లాగ్‌షిప్ సేల్ అయిన ‘రిపబ్లిక్ డే సేల్’ను తిరిగి ప్రకటించింది. కిరాణా వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, గృహ సంరక్షణ, ఆహార, పానీయాల వంటి విభిన్న కేటగిరీల ఉత్పత్తులపై ఉత్తమమైన ఆఫర్లను పొందవచ్చు. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 76% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

మొదటి ఈ-కామర్స్ ఆర్డర్‌పై రూ. 150 అదనపు తగ్గింపు అందుబాటులో ఉంది.

సభ్యులు HDFC కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సహా ఇతర చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. RBL, AU బ్యాంక్, రూపే వంటి భాగస్వామ్య బ్యాంకుల నుంచి ప్రత్యేక క్రెడిట్ సదుపాయాలు లభిస్తాయి.

ఫ్లిప్కార్ట్ హోల్సేల్ తమ గణతంత్ర దినోత్సవ సేల్ ద్వారా కిరాణా వ్యాపారులకు వినూత్న పరిష్కారాలను అందిస్తూ, వారిని లాభదాయకంగా మారడానికి ప్రోత్సహిస్తుంది. అధునాతన సాంకేతికత, లోతైన మార్కెట్ ఇన్‌సైట్లు, సృజనాత్మక సేవల ద్వారా వ్యాపార వృద్ధికి పునాది వేస్తుంది.

ఫ్లిప్కార్ట్ హోల్సేల్ వైస్ ప్రెసిడెంట్ దినకర్ ఐలవరపు వ్యాఖ్యలు:
“మా సభ్యుల కోసం అదిరిపోయే ఆఫర్లను అందించడంలో సంతోషిస్తున్నాం. ఈ రిపబ్లిక్ డే సేల్ ద్వారా వ్యాపార లాభాలను పెంపొందించడానికి కిరాణా వ్యాపారులకు బలమైన అవకాశాలను అందిస్తున్నాం.”