Thu. Nov 21st, 2024
Health-checkup_

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 27,2023:
అక్రిడిటేషన్ కలిగిన మహిళా జర్నలిస్టులకు మార్చి 29 నుంచి పది రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా జర్నలిస్టులకు పురస్కార కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాల్సిందిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ మేరకు ఈ నెల 29తేదీ నుంచి మాసాబ్ ట్యాంక్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్ లో రక్త పరీక్ష (సీ.బీ.పీ) , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బి12, డి3 మొదలైన డయాగ్నోస్టిక్స్ పరీక్షలు, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, కంటి స్క్రీనింగ్ , దంత పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైన పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షల రిపోర్ట్ లు అదే రోజు అందజేయనున్నారు.

Health-checkup_

ఈ ఉచిత వైద్య శిబిరం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఈ అవకాశాన్నిస్టేట్ అక్రిడిటేషన్ కలిగిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అక్రిడిటేషన్ పొందిన మహిళా జర్నలిస్టులు వినియోగించుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు.

జిల్లాలకు చెందిన అక్రిడిటేడ్ ఉమన్ జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

error: Content is protected !!