365తెలుగుడాట్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 29, 2023: జనవరి 30వతేదీన హైదరాబాద్ నగరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు క్యాన్సర్ శిబిరాల నిర్వాహకురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, జిల్లా కార్యదర్శి ఎం. రమాదేవి రెడ్డి తెలిపారు.
శనివారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
320A, నవభారత్ అండ్ 320D రెండు క్లబ్‌లు ఎమ్.ఎన్ జి క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ హిల్స్ సహకారంతో కలిసిజనవరి 30వతేదీ ఉదయం 10.30 గంటలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఈ మెడికల్ క్యాంప్ లో ఓరల్. బ్రీట్. గర్భాశయ స్క్రీనింగ్ డిజిటల్ మామోగ్రామ్,సోనో మామోగ్రామ్. పాప్ స్మెర్ ,అల్ట్రాసౌండ్ ఉదరం , డెంటల్ వంటి టెస్ట్ లు ఫ్రీ గా చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఎల్ఎన్ జూలూరి రఘు ,2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ఎన్ డి.కోటేశ్వరరావు, లయన్ వి లక్ష్మి మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320 డి లయన్.డా.సి ప్రకాష్, ఎల్‌ఎన్ యాదయ్య గౌడ్, రీజియన్ చైర్ పర్సన్, గోపాల్ కృష్ణ ఈ మెడికల్ క్యాంప్ ను ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని డా.హిప్నో పద్మా కమలాకర్ సూచించారు. మరిన్ని వివరాలకు 9390044031 నంబర్ ను సంప్రదించవచ్చు.