Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 15,2024 : భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపుతో, వివిధ ప్రజా సంఘాలు, ప్రముఖులు వ్యాపారస్తులు ముందుకు వస్తున్నారు. తమ మానవత్వాన్ని చాటుతూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

తాజాగా విజయవాడకు చెందిన డి.డి. రెమిడీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, వరద బాధితుల సహాయార్థం రూ.40 లక్షల విలువైన ఎమర్జెన్సీ మందుల కిట్లను అందించేందుకు ముందుకొచ్చింది. శనివారం, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్ మెడికల్ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. https://www.janasenaparty.org/

బాధితులకు అవసరమైన మెడికల్ కిట్లను విజయవాడలోని వైద్య శిబిరాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు డి.డి. రెమిడీస్ సంస్థ ప్రతినిధి తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్ వంటి పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా, వరద బాధితులకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడం,వారి కష్టాలను కొంతమేర తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. https://www.janasenaparty.org/

error: Content is protected !!