365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నల్గొండ, మే2, 2023:ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఫ్రీ ఆన్ లైన్ కోచింగ్ యాప్ తీసుకొస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ప్రకటించారు. గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ‘నల్లగొండ యువతరం’ పేరుతో మే 7తేదీన ఈ యాప్ లాంచ్ చేస్తున్నట్టు చెప్పారు.
ఈ యాప్ లో 57 రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటుగా రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి సంవత్సరం లక్షా 40వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నాయని ఈ యాప్ ద్వారా విద్యార్థులు ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఆన్ లైన్ క్లాసులు అందుబాటులో ఉంటాయన్నారు.
నల్లగొండ యువతరం యాప్ లో SBI, IBPS, RBI, NAABARD, FCI, SEBI, POSTAL, INSURANCE, STAFF SELECTION COMMISSION, CDS, AFCAT, CAPF లాంటి కేంద్ర ప్రభత్వ పోటీ పరీక్షలతో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్, TSPSC నిర్వహించే గ్రూప్ పరీక్షలకు కుడా ఉపయోగపడతాయి.
అంతేకాదు CAT, MAT, CLAT ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తోపాటుగా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో నిర్వహించే CAMPUS RECRUITMENT TESTS కి కూడా ఈ ఆన్ లైన్ క్లాసులు అద్భుతంగా ఉపయోగపడతాయి.
దీంతోపాటు గ్రూప్స్ తోపాటు టీజీటీ, పీజీటీ, ఆర్థమెటిక్ శిక్షణ కోసం భౌతిక తరగతులు టీఎన్జీఓ భవన్లో ప్రారంభించబోతున్నట్టు చెప్పారాయన. మే7న నల్లగొండ యువతరం యాప్ లాంచింగ్ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గుత్తా అమిత్ రెడ్డి కోరారు.