365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 18, 2025: హైటెక్ సిటీకి రోజువారీ ప్రయాణం మరింత సౌకర్యవంతమవుతుంది. మార్చి 17 నుంచి ఉబెర్ 3 వారాల పాటు ఉచిత ఉబెర్ షటిల్ రైడ్‌లను అందించనుంది. ఈ సేవ ప్రయాణికులకు ట్రాఫిక్ రద్దీని తగ్గించి, స్మార్ట్ , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ ఫ్రీ రైడ్స్ ను ప్రవేశపెట్టారు.

ఉబెర్ షటిల్, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలను శేర్డ్ మాస్ మొబిలిటీతో కలుపుతుంది. ప్రస్తుతం ఇది ఢిల్లీ, కోల్‌కతాలో విజయవంతంగా పనిచేస్తోంది. హైటెక్ సిటీకి వెళ్ళే మార్గాలలో ఉచిత షటిల్ రైడ్‌లు అందుబాటులో ఉంటాయి. అల్వాల్, అమీన్‌పూర్, బాచుపల్లి, నాంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం నుంచి అన్ని మార్గాలలో ఉచిత రైడ్స్ అందుబాటులో ఉంటాయి, హైటెక్ సిటీ నుంచి మాళ్ళీ ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్తాయి.

https://www.uber.com/in/en/ride/uber-shuttle/?city=hyderabad

ప్రయాణికులు ఉబెర్ యాప్ ద్వారా సీట్లు బుక్ చేసుకోవచ్చు, షటిల్ లొకేషన్‌ను ట్రాక్ చేసుకోవచ్చు. అన్ని రైడ్లు భద్రతా ప్రమాణాలతో ఉంటాయి.

ఉబెర్ షటిల్ రైడ్ బుక్ చేయడం ఎలా..?

ఉబెర్ యాప్ ఓపెన్ చేయండి
హైటెక్ సిటీని గమ్యస్థానంగా ఎంచుకోండి
ఉచిత రైడ్‌ను సమీక్షించండి
పికప్ సమయాన్ని ఎంచుకోండి
షటిల్ ట్రాక్ చేయండి
ప్రయాణం సురక్షితంగా ,సౌకర్యవంతంగా ఫ్రీగా ప్రయాణించండి.