
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 24,2022: ప్రముఖ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇండియాలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సెగ్మెంట్‌లో ఈ ఏడాది వాల్యూమ్ సేల్స్ ప్రకారం నంబర్ వన్ బ్రాండ్‌గా ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో 20.5% విలువతో ‘ఫ్రీడమ్’ భారతదేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించినందుకు మేము సంతోషిస్తున్నాం” ఇది మా వినియోగదారు-కేంద్రీకృత విధానం, పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్, నాణ్యతపై దృష్టి పెట్టడం ఫలితంగా మా బ్రాండ్ ఈ విజయం సొంతం చేసుకుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం ఎక్కువగా ఉన్న తమిళనాడు, కేరళలో ప్రారంభించాలని మేము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Freedom Refined Sunflower Oil is the number one brand in India

ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ,.. “భారతదేశంలో మార్కెట్ వాటా ప్రకారం ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నంబర్ వన్ గా మారడం మాకు చాలా ఆనందంగా ఉంది. కస్టమర్‌లకు మేము అందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నామని ఆయన అన్నారు. నీల్సన్ IQ ద్వారా రిటైల్ ఇండెక్స్ సేవ గ్రోసర్స్, జనరల్ స్టోర్స్, కెమిస్ట్స్, కాస్మెటిక్ స్టోర్స్, పాన్ ప్లస్ స్టోర్స్ ,మోడరన్ ట్రేడ్ స్టోర్‌లను కవర్ చేస్తుంది.

‘భారతదేశంలో ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ అత్యధిక దిగుమతిదారు’ విభాగంలో ప్లాటినం అవార్డును కైవసం చేసుకుంది. 2018లో The Globoil India ‘Emerging Brand’ అవార్డు ‘ఫ్రీడమ్’ బ్రాండ్‌కు దక్కింది. ఇండియా టుడే ‘ఇస్పోస్ అర్బన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే 2020’ ప్రకారం ‘ఫ్రీడమ్’ బ్రాండ్ భారతదేశంలోని టాప్ ఫైవ్ వంట నూనె బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.
Freedom Refined Sunflower Oil is the number one brand in India