Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 14, 2023: ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసే, పేదవారు, ఉద్యోగానికి సరైన పనిముట్లు లేదా సాధనాలు లేని వారు, కొనుక్కోవడానికి సరైన ఆర్ధిక స్థోమత లేనివారు, దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానిస్తున్నారు.

నగరంలో జరగనున్న గ్రాండ్ ఫెస్టివల్ 2023 సందర్భంగా 50 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి పొందడానికి కావలసిన పనిముట్లను అందించడానికి ఫ్రీమేసన్స్ సంస్థ ముందుకొచ్చింది.

అందులో భాగంగానే ప్రతిభావంతులైన కానీ పేద, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించే సాధనాలను కొనుగోలు చేయలేని స్వయం ఉపాధి ఉన్నవారు నవంబర్18లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

లబ్ధిదారులు (ఇంటి నుంచి పని చేసే మహిళలు, చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు,స్వయం ఉపాధి పొందేవాళ్ళు) వాట్సాప్ నంబర్ 9848042020లో వారి ఫోటో, ఆధార్ కార్డ్, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, కావలసిన పనిముట్ల పేర్లు లేదా వివరాలు, మెషినరీల గురించి తెలపగలరు. మొబైల్ ఫోన్‌లో కాల్ చేయవద్దు వాట్సాప్ మాత్రమే పంపగలరు.

అర్హులైన 50 మందికి నవంబర్ 24న హైదరాబాద్‌లో ఉచిత పంపిణీ జరగనుంది. 9వ దశ గిఫ్ట్-ఎ-లైవ్లీహుడ్ చొరవలోభాగంగా గ్రాండ్ ఫెస్టివల్ 2023 హైదరాబాద్ నగరంలో జరుగనున్నదని నిర్వాహకులు తెలిపారు.

ఇది ఫ్రీమేసన్స్ దేశంలోని అతున్నంత బాడీ అయిన గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా 62 సంవత్సరాల చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఫ్రీమేసన్రీ వార్షిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఆ శుభ సందర్బంగా ఈ వితరణ కార్యక్రమం జరగనుంది.

గుర్తించిన లేదా ఎంపిక చేసిన 50 మంది లబ్ధిదారులకు వారు ఎంచుకున్న వృత్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఒక్కొక్కరికి రూ. 6000/- నుంచి రూ.7000/- విలువైన సాధనాలు అందించనున్నారు.

ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, టిఫిన్ సెంటర్లకు పాత్రలు, డ్రిల్లింగ్, వెల్డింగ్ మిషన్లు, కట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, స్కూటర్ మెకానిక్‌లకు ఉపకరణాలు, వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు, స్టేషనరీ మెటీరియల్‌లు, దుకాణాలకు గాజులు మొదలైనవి వారి అభ్యర్థన మేరకు అందించనున్నారు.

పేద , చిన్న-నిపుణులకు, ఇంటి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహించాలనుకునే మహిళలకు సహాయం చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా వారు మెరుగైన, మరింత స్థిరమైన జీవనాన్ని సంపాదించుకోవటానికి తోడ్పడాలనేది దీని ఉద్దేశం.

అనీష్ కుమార్ శర్మ, OSM (ఆర్డర్ ఆఫ్ సర్వీస్ టు ది మేసన్రీ, భారతదేశంలోని ప్రీమేసన్ సభ్యులకు, గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా, ఫ్రీమే సన్స్ దేశంలో ని అతున్నంత సంస్థ అందించే అత్యున్నత గుర్తింపు పొందిన విశిష్ట సభ్యుడు), భారతదేశంలో ఫ్రీమేసన్రీ అధిపతి అయిన గ్రాండ్ మాస్టర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

దక్షిణ భారతదేశంలోని రీజినల్ గ్రాండ్ లాడ్జ్ ,దక్షిణ భారతదేశంలోని ఫ్రీమేసన్రీ అధిపతి TN మనోహరన్ గౌరవ అతిథిగా విచ్చేయనున్నారు. వీరిద్దరు లబ్ధిదారులకు పనిముట్లను అందజేయనున్నారు.

ఫ్రీమేసన్స్ వినూత్న, ఉపయోగకరమైన చొరవ అయిన గిఫ్ట్-ఎ-లైవ్లీహుడ్ అనేది ఎవరికైనా ఇవ్వగలిగే అత్యుత్తమ బహుమతి. ఇది ప్రతిభావంతులైన ,కష్టపడి పనిచేసే వ్యక్తులకు సహాయం చేస్తుంది.

అయితే ఉద్యోగం కోసం సరైన సాధనాలు లేక ఇబ్బంది పడే వారికోసం ఉపయోగపడే చొరవ. తద్వారా వారు మెరుగైన ,మరింత స్థిరమైన జీవనాన్ని సంపాదించ గలిగేందుకు తోడ్పడే చొరవ.

ప్రజలు కోల్పోయిన జీవనోపాధిని తిరిగి పొందడంలో సహాయపడటానికి కరోనా సమయంలో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన చొరవ ఇది. కుట్టు మిషన్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు, పెయింటర్లు, ఇస్త్రీ చేసేవారికి,చిరు వ్యాపారస్తులు, రోడ్డు పై వ్యాపారం చేసేవారు, ఇంటి వద్ద పనిచేయగోరె మహిళలు ఇలాంటి 730 మంది జీవితాలను తెలంగాణ రాష్ట్ర నలుమూలల ప్రభావితం చేసింది ఈ చొరవ.

గిఫ్ట్-ఎ-లైవ్లీహుడ్ అనేది తెలంగాణలో ఫ్రీమేసన్స్ అనే స్వచ్చంద సంస్థ చొరవ అత్యంత విజయవంతమైనది. ఇది150 పట్టణాలలోని ఈ చొరవను ఫ్రీమేసన్స్ అనుకరిస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు,పరోపకారులు ఈ చొరవతో ఫ్రీమేసన్స్ సంస్థతో ఈ చొరవతో చేతులు కలపవచ్చు.