365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 31, 2025: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అడుగు పడింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (AIPC) లో ముఖ్య నియామకం జరిగింది. సంస్థాగత విస్తరణలో భాగంగా, శశాంక్ పసుపులేటి గారిని తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఎంఈ (MSME) విభాగాధ్యక్షుడిగా నియమించింది.

ఎంఎస్ఎంఈల శక్తివంతంపై గాంధీ భవన్‌లో ప్రత్యేక సమావేశం..

నియామక పత్రాలు అందుకున్న వెంటనే, శశాంక్ పసుపులేటి చురుకుగా రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఎంఎస్ఎంఈ శక్తివంతం (Empowerment Session) అనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, పరిశ్రమ నిపుణులు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల (MSME) ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రధాన లక్ష్యం ఏమిటంటే..?

తెలంగాణ వ్యాపార వాతావరణాన్ని బలోపేతం చేయడం, చిన్న వ్యాపారులకు ప్రభుత్వ పథకాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం,కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ సమావేశం ఉద్దేశం.

ఉద్యమ శక్తికి, సమగ్ర అభివృద్ధికి శశాంక్ నాయకత్వం..

శశాంక్ పసుపులేటి నియామకంతో AIPC తెలంగాణ విస్తరణలో ఒక కీలక మైలురాయి నెలకొంది. ఆయన నాయకత్వంలో ఉద్యమ శక్తి, సమగ్ర ఆర్థిక అభివృద్ధి, మరియు సమాన అవకాశాల కల్పన లక్ష్యంగా AIPC ముందుకు సాగనుంది.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఎంఎస్ఎంఈ పథకాల సహాయంతో వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆయన విశేషంగా కృషి చేయనున్నారు.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు..

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రాలకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు శశాంక్ పసుపులేటి.

దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలకు శక్తినిచ్చే వారి నాయకత్వం తనకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ప్రవీణ్ చక్రవర్తి, ఖలీద్ సైఫుల్లా, సుధాకర్ సుందర్వెల్ (జాతీయ ఎంఎస్ఎంఈ అధిపతి, AIPC), డా. నవికా హర్షే (జాతీయ విధాన విభాగాధిపతి), డా. కోట నీలిమ, ఆదిత్య రెడ్డి (AIPC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు), శ్రీమతి పల్లవి, AIPC సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నేపథ్యం: వివిధ రంగాల్లో విశాల అనుభవం..

ఎంఎస్ఎంఈ బాధ్యతలు స్వీకరించే ముందు, శశాంక్ పసుపులేటి పలు సామాజిక, రాజకీయ, నాయకత్వ పదవుల్లో సేవలు అందించి, విశాలమైన అనుభవాన్ని గడించారు.

TPCC కోఆర్డినేటర్ – లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ & RTI, తెలంగాణ, బిసి యూత్ తెలంగాణ ఉపాధ్యక్షుడు, డెక్కన్ మనవ సేవా సమితి ఉపాధ్యక్షుడు,సికింద్రాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, వర్డ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు..

SK గ్రూప్ ఆఫ్ కనెక్షన్స్ (నిర్మాణం, రియల్ ఎస్టేట్, లీగల్ కన్సల్టెన్సీ, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో జాతీయ స్థాయిలో పనిచేసే సంస్థ) వ్యవస్థాపకుడు & సిఇఓగా సేవలందించారు.

పాలన,వ్యాపారరంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన శశాంక్ పసుపులేటి తెలంగాణలో యువ శక్తి, మహిళా వ్యాపారారంభాలు, పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చేందుకు తమ శక్తియుక్తులన్నింటినీ వినియోగించనున్నారు.