Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,ఏప్రిల్ 15, 2024:తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

ఏప్రిల్ 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం :

ఏప్రిల్ 18న తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుంచి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 19న శ్రీరామ పట్టాభిషేకం :

ఏప్రిల్ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుంచి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 8-30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు.

ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు :

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also read : VODAFONE IDEA LIMITED Rs. 18,000 CRORE FURTHERPUBLIC OFFERING TO OPEN ON THURSDAY APRIL 18, 2024

Also read : Siddhartha Basu’s ‘Quizzer Of The Year’ all set to air its championship rounds from 15th April only on Sony LIV..

Also read :St. Joseph’s Children’s Hospital Foundation Receives Historic $50 Million Gift from the Pagidipati Family of Tampa

Also read :Goldmedal joins forces with highly anticipated sequel Pushpa 2..

Also read : Canon India Redefines Broadcast Excellence with Flagship 4K Remote PTZ Camera Controller & 4K Indoor Remote PTZ Camera CR-N100.

ఇది కూడా చదవండి: ఉత్సాహంగా శివరాంపల్లి జడ్పీఎస్ 2002-2003 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

ఇది కూడా చదవండి: ఇన్వర్టర్ బ్యాటరీలో ఎంత నీరు నింపాలి..?

ఇది కూడా చదవండి: ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదం పుస్తకాలు ఉచితం..

ఇది కూడా చదవండి: డా.బి.ఆర్.అంబేద్కర్ అప్పుడు న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసింది ఇందుకే..

ఇది కూడా చదవండి: రేపటి నుంచి హీరోమావెరిక్ 440 బైక్ డెలివరీ ప్రారంభం..

error: Content is protected !!