365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూ ఢిల్లీ, మార్చి 3,2025: వీడియో కాలింగ్, స్మార్ట్ఫోన్లు, డ్రోన్లు, రోబోట్లు… ఇవన్నీ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. కానీ, గతంలో ఇవి కేవలం సినిమాలు, టీవీ షోలు, నవలల రచయితల ఊహల్లో మాత్రమే ఉండేవి.
సైన్స్ ఫిక్షన్ కేవలం ఊహలా అనిపించినా, కొన్నేళ్ల తర్వాత అవి నిజమయ్యాయి. మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడంలో టెక్నాలజీ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో, దశాబ్దాలుగా సైన్స్ ఫిక్షన్ చిత్రాలు, రచనలు చూపించాయి.
ఇది కూడా చదవండి…ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: 20 శాతం ఓట్లకు పైగా చెల్లనివి
Read this also...MLC Polls Vote Counting: 20% Invalid Votes Create Major Concern
1977లో జార్జ్ లూకాస్ తెరకెక్కించిన ‘స్టార్ వార్స్’లో తొలిసారి హోలోగ్రామ్ టేబుల్‌ను చూపించారు. 1960ల్లో వచ్చిన ‘ద్ జెట్సన్స్’ కార్టూన్ సిరీస్‌లో వీడియో కాలింగ్, ఎగిరే కార్లను ఊహించారు. అయితే, శాస్త్రవేత్తలకంటే ముందే టెక్నాలజీపై ఆలోచనలు రచయితలలో పుట్టాయి. ఈ ఊహా సత్యాలను నిజంగా తీసుకురావడానికి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా మారాయి.
స్మార్ట్‌ఫోన్:
1966లో వచ్చిన ‘స్టార్ ట్రెక్’ టీవీ షోలో వాయిస్ కమ్యూనికేషన్ కోసం ‘కమ్యూనికేటర్’ అనే ఫిక్షనల్ డివైస్‌ను చూపించారు. ఇది ఫ్లిప్ అయ్యే, పోర్టబుల్ డివైస్. దాదాపు 30 ఏళ్ల తర్వాత, మోటరోలా తన తొలి ఫ్లిప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లు మరింత ఆధునికంగా మారిపోయాయి.

వీడియో కాలింగ్:
ప్రస్తుతం వ్యాపార సమావేశాలు, వ్యక్తిగత సంభాషణల కోసం జూమ్, ఫేస్‌టైమ్, వీవోఐపీ యాప్‌లు విస్తృతంగా వాడుతున్నారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా రోజుకు కోట్లు మంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కానీ, 1960లో వచ్చిన ‘ద్ జెట్సన్స్’ కార్టూన్ షోలో, అలాగే జర్మన్ సినిమా ‘మెట్రోపొలిస్’లోనూ వీడియో కాలింగ్‌ను ఊహించారు.
ఇది కూడా చదవండి…ED నోటీసు ప్రభావం.. Paytm షేర్లకు భారీ పతనం
ఆటోనామస్ కార్లు:
1950లో ఇసాక్ అసిమోవ్ రాసిన ‘ది ఇవిటబుల్ కాన్ఫ్లిక్ట్’ నవలలో డ్రైవర్ లేని కార్లను ఊహించారు. ఈ కార్లు రోబోటిక్ బ్రెయిన్ సహాయంతో నడిచేలా, ట్రాఫిక్ మానిటరింగ్ చేసేలా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం టెస్లా, గూగుల్, ఇతర కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్లను వాస్తవంగా రూపొందించాయి.
లైవ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్:
1979లో డగ్లస్ ఆడమ్స్ రాసిన ‘ది హిచ్ హైకర్స్ గైడ్ టు గెలాక్సీ’లో ‘బేబెల్ ఫిష్’ అనే ఓ ఊహా జీవి ఉంటుంది. అది వినిపించే భాషను తక్షణమే అనువదించి వినిపిస్తుంది. ఈ ఐడియా ఆధారంగా గూగుల్ ట్రాన్స్‌లేట్, రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఈయర్‌బడ్స్ వాస్తవంలోకి వచ్చాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI):
1927లో వచ్చిన జర్మన్ చిత్రం ‘మెట్రోపొలిస్’లో మానవ ఆకారంలో ఉండే రోబోను చూపించారు. ఇది మానవుల్లా ఫ్యాక్టరీల్లో పని చేస్తుందని ఊహించారు. ప్రస్తుతం, హ్యూమనాయిడ్ రోబోలు వాస్తవంగా రూపుదిద్దుకున్నాయి. AI టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో, మానవ మెదడు, యంత్రాల మధ్య సంబంధాన్ని గురించి చర్చలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి…ఓలా ఎలక్ట్రిక్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత – 1,000 మందికి పైగా తొలగింపు!
సైన్స్ ఫిక్షన్ ఊహల్లో మొదలైన టెక్నాలజీ, కాలానికి అనుగుణంగా మన జీవితంలో భాగమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఊహలు మరిన్ని కొత్త ఆవిష్కరణలకు దారి తీయడం ఖాయం!