365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 25,2023: రొబోటిక్ గాస్ట్రో ఇంటస్టినల్, బారియాట్రిక్ సర్జన్ గా చిత్ర పరిశ్రమతోపాటు ఎందరికో సుపరిచితులైన ‘గణేష్ గొర్తి’కి ఎఫ్టీపీసీ ఇండియా పురస్కారం లభించింది.

భారతదేశంలోనే మొదటిసారిగా 39 సంవత్సరాల మహిళకు ఎస్ ఎస్ ఐ మంత్ర రోబో సర్జరీని గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో నిర్వహించి విజయవంతమైన డాక్టర్ గణేష్ ని హెల్త్ అండ్ మెడికల్ అచీవ్ మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించింది.
పాన్ ఇండియా సినీ నటి దెబ్లీనా దత్తా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ గణేష్ మాట్లాడుతూ… ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఇది గర్వకారణమని, ఆరోగ్య రంగాన్ని కూడా గుర్తించి సినీ సంస్థ నన్ను సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, సినీ పరిశ్రమకు తమ ఆరోగ్య సేవలు ఎప్పుడు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఎఫ్ టీ పి సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ… “దేశంలోనే వైద్యరంగానికి గర్వకారణమైన డాక్టర్ గణేష్ గారి సేవలను చలన చిత్ర పరిశ్రమ వినియోగించుకోవాలని అన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ ప్రతినెలా ఉచిత మెడికల్ క్యాంపు లు నిర్వహించేలా ఒప్పించాలని సంస్థ ప్రధాన కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి అభ్యర్ధించారు.

పదికి పైగా బాషలలో నటించిన తాను ఓ సారి పెద్ద చిత్రంలో తెలుగు సినిమా అవకాశం వస్తే అప్పటికే ఆ డేట్స్ ఒక హిందీ చిత్రానికి కేటాయించిన కారణంగా నటించలేకపోయానని, తెలుగు సినిమాలో రాణించడం తన డ్రీం అని సినీ నటి దెబ్లీనా దత్తా అన్నారు.