365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: “గేమ్ ఛేంజర్” సినిమా 10 జనవరి 2025 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాతో 3 సంవత్సరాల తర్వాత కొత్త సినిమాతో వచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ నటి కియారా ఆడ్వాణీ (Kiara Advani) కూడా నటించారు. అసలు సినిమా ఎలా ఉంది..? హిట్టా ఫట్టా..?

గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి “రామ్ నందన్” గా కనిపిస్తారు. మొదటి సారి డబుల్ రోల్ పోషిస్తూ ఈ సినిమాని మరింత ఆసక్తికరంగా మలిచారు శంకర్. రామ్ చరణ్ పాత్రలతో సినిమా నడుస్తున్నా, కథలో ట్విస్టులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలాగే జే.ఎస్. సూర్య (బొబ్బిలి మోపిదేవి) అనే ప్రతినాయకుడు పాత్ర ఈ సినిమాకు మరింత హైలెట్ అయిన అంశం.

సినిమా హైలైట్స్..

రామ్ చరణ్ అద్భుతమైన డబుల్ రోల్ తో అభిమానులను అలరిస్తారు.
కియారా ఆడ్వాణీ తో రామ్ చరణ్ ల జోడి చాలా బాగుంది.స్పెషల్ సస్పెన్స్, యాక్షన్, పబ్లిక్ డ్రామా ఎలిమెంట్స్ సినిమాను మరింత ఉత్సాహంగా మారుస్తాయి.

డైరెక్షన్: ఎస్. శంకర్
ఎస్. శంకర్ తన గత సినిమా “భారతీయుడు 2” (Indian 2) తో నిరాశ పరిచినప్పటికీ, గేమ్ చేంజర్ విషయంలో అలాంటివి కనిపించలేదు. ఈ సినిమా కచ్చితంగా శంకర్ మార్క్ డైరెక్షన్ స్టైల్‌ను చూపిస్తుంది.

స్క్రీన్ ప్లే: కార్తీక్ సుబ్బరాజ్..

కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే అందించారు. ఆయన ఈ సినిమా స్క్రీన్ పై అన్ని మసాలా అంశాలను అద్భుతంగా పేస్ చేసి, కథకు తగినట్లుగా అందించారు.

స్టార్ క్యాస్ట్..

రామ్ చరణ్ , కియారా ఆడ్వాణీ కాకుండా, జే.ఎస్. సూర్య, ప్రకాశ్ రాజ్, సునీల్, మీనా శ్రీకాంత్, జయరామ్, అంజలి లాంటి స్టార్ క్యాస్ట్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ ఎక్స్ ..

సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ ఎక్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకునే విధంగా సినిమాటోగ్రఫీ రూపొందించారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ నటన అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా ఉంది. “గేమ్ చేంజర్” అద్భుతమైన చిత్రంగా నిలిచింది.
గేమ్ చేంజర్ మూవీ రివ్యూ
సినిమా పేరు: గేమ్ ఛేంజర్
రేటింగ్: 3.5/5
తారాగణం: రామ్ చరణ్, కియారా ఆడ్వాణీ, జే.ఎస్. సూర్య, అంజలి, శ్రీకాంత్
దర్శకుడు: ఎస్. శంకర్
నిర్మాత: దిల్ రాజు
రిలీజ్ డేట్: జనవరి 10, 2025
ప్లాట్‌ఫామ్: థియేటర్స్
భాషలు: తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం..
365తెలుగు డాట్ కామ్ రేటింగ్ 3.5/5.