Wed. Dec 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 11,2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచాయి.

తాజాగా విడుదలైన మూడో పాట ‘నా నా హైరానా’ 47 మిలియన్ వ్యూస్‌ను సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ మధ్య కెమిస్ట్రీను అద్భుతంగా తెరపై చూపించిన శంకర్, ఈ పాటను విభిన్నంగా తెరకెక్కించారు.

న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్, క్రిస్టచర్చ్ లొకేషన్లలో 6 రోజులు పాట చిత్రీకరణ జరిగింది.

రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో తీయబడిన ఈ పాట కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడం విశేషం.

శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడిన ఈ పాటకు ఎస్.తమన్ ఫ్యూజన్ మెలోడీగా సంగీతాన్ని అందించారు.

బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ, మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్, ఆలీమ్ హకీం స్టైలింగ్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

‘గేమ్ చేంజర్’లో రామ్ చరణ్ ఓ పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, సమాజానికి సేవ చేయాలనుకునే యువకుడి పాత్రను కూడా పోషిస్తున్నారు. రాజకీయ అంశాలు, హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన కథనంతో సినిమా ప్రేక్షకులకు వినోదం పంచనుంది.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా హిందీలో ఏఏ ఫిల్మ్స్ ద్వారా విడుదల కానుంది. డిసెంబర్ 21న అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ఇప్పటివరకు విడుదలైన ‘జరగండి జరగండి’, ‘రా మచ్చా రా’ పాటలు, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘గేమ్ చేంజర్’ టీజర్ రామ్ చరణ్‌ను ఓ కొత్త అవతార్‌లో చూపిస్తూ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో సందడి చేయడానికి ‘గేమ్ చేంజర్’ సిద్ధమవుతోంది!

error: Content is protected !!