365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 21, 2024: ద గాడియం స్కూల్ తన పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అద్భుతమైన టెడ్ ఎక్స్ కార్యక్రమంతో తన పదో వార్షికోత్సవ సంబరాలను ప్రారంభించింది. ఏడాదిపాటు ఈ కార్యక్రమాలు సాగుతాయి.
ఈ ప్రధాన కార్యక్రమంతో డైనమిక్ వక్తలు ఒకచోటుకు వచ్చి.. సమగ్రాభివృద్ధి, సృజనాత్మక విద్య విషయంలో పాఠశాలకు ఉన్న నిబద్ధతను హైలైట్ చేశారు.
విస్తారమైన విశ్వంలో ఒక చిన్న మచ్చగా భూమిపై కార్ల్ సాగన్ చెప్పే ప్రసిద్ధ ప్రతిబింబం నుంచి ప్రేరణ పొందిన “పేల్ బ్లూ డాట్” థీమ్, మన గ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి భాగస్వామ్య బాధ్యతను హృదయపూర్వకంగా గుర్తుచేసింది.
ఈ కార్యక్రమం పరస్పర సంబంధాన్ని పెంపొందించడానికి, మన ప్రపంచాన్ని రక్షించడంలో, ఆదరించడంలో మన సమష్టి పాత్ర గురించి ఆలోచనాత్మక సంభాషణలను ప్రేరేపించడానికి ప్రయత్నించింది.
టెడ్ ఎక్స్ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఆకర్షణీయమైన కథలు, ఇన్‌సైట్లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన ప్రయాణాన్ని, గొప్పతనాన్ని సాధించడంలో పట్టుదలకు ఉండే ప్రాధాన్యాన్ని వివరించారు.
పర్యావరణ ఉద్యమకారిణి కల్పనా రమేష్ సుస్థిర జీవనం కోసం తన ఉద్వేగభరితమైన వాదనతో ప్రేక్షకులను ప్రేరేపించారు.
గాయని, విద్యార్థిని, బహుముఖ ప్రజ్ఞాశాలి స్కంద వేలువల్లి, తన సంగీత ప్రతిభను, వ్యక్తిగత ఎదుగుదలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గాడియం స్కూల్ విద్యార్థులు టెడ్ ఎక్స్ వేదికపైకి వచ్చారు. పదో తరగతి నుంచి శ్లోకా మధు, ఐబీడీపీ 2 నుంచి ఆగం మెహతా, ఎంవైపీ 5 నుంచి హన్షిక జొన్నల శక్తివంతమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు హాజరై చొరవను, ప్రజెంటేషన్ల నాణ్యతను ప్రశంసించారు.
టెడ్ ఎక్స్, ద గాడియం స్కూల్ కలిసి మార్పును ప్రోత్సహించాలని, వైవిధ్యాన్ని పొందాలని, సంప్రదాయ బంధనాలను ఛేదించాలని ఒక మంచి ప్రయత్నం చేశాయి. “పేల్ బ్లూ డాట్” థీమ్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచ ఐక్యత, భాగస్వామ్య ఉనికి భావాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది.
విస్తృతమైన, ఆకర్షణీయమైన అంశాల ద్వారా ప్రామాణిక టెడ్ ఎక్స్ అనుభవాన్ని అందించింది.
ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ కీర్తిరెడ్డి మాట్లాడుతూ, “గాడియం స్కూల్ పది సంవత్సరాల విజయ ప్రయాణానికి గుర్తుగా అద్భుతమైన సంబరాలను ఏడాది మొత్తం చేసుకుంటున్నాం. అందుకు టెడ్ ఎక్స్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది. సరికొత్త హామీలు, ఆవిష్కరణలతో నిండిన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నాం.
విద్యార్థులు, తల్లిదండ్రులు, భాగస్వాములతో సహా పాఠశాల సమాజం మొత్తం ఈ అద్భుతమైన మైలురాయిని చేసుకుంటున్నప్పుడు ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది” అన్నారు.
Also read :Famous YouTuber Armaan Malik participates in ‘Bigg Boss OTT’ season 3
Also read :FINANCIAL RESULTS (INDIAN GAAP) FOR THE QUARTERENDED JUNE 30, 2024..
ఇదికూడా చదవండి: FLO స్టైల్ తత్వ ఎక్స్ పో ను ప్రారంభించిన బుల్లి తెర తార సుమ కనకాల..