365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, 3 ఫిబ్రవరి, 2023: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మహువా మొయిత్రా అదానీ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్ కు, సెబీ అధికారులకు మధ్య సంబంధం ఉందని, అందుకే అంతా ఏకపక్షంగా జరిగిందని ఆమె అన్నారు.
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏజెన్సీ సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై స్టాక్ మానిప్యులేషన్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజకీయపరంగా దుమారం రేగుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత మహువా మొయిత్రా అదానీ గ్రూప్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ గ్రూప్ నకు, సెబీ అధికారులకు మధ్య సంబంధం ఉందని, అందుకే అంతా ఇష్టారాజ్యంగా చేశారని ఆమె అన్నారు.
సెబీ కమిటీలో అదానీ బంధువులు కూడా పనిచేస్తున్నారని, అందుకే ఇలాంటి రిగ్గింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు.
సెబీ కమిటీలో అదానీ సహచరులు కూడా ఉన్నారని ఎంపీ మహువా మోయిత్రా అంటున్నారు. సెబీ కమిటీలో అదానీ స్నేహితుడు, ప్రముఖ న్యాయవాది సిరిల్ ష్రాఫ్ పనిచేస్తున్నారని ఆమె చెప్పారు.
సిరిల్ ష్రాఫ్ కుమార్తె గౌతమ్ అదానీ కుమారుడిని వివాహం చేసుకున్నదని మహువా తెలిపారు.
ప్రముఖ న్యాయవాది సిరిల్ ష్రాఫ్‌కు అదానీ గౌతమ్ అంటే అత్యంత గౌరవమని, అయితే ఆయన కుమార్తె గౌతమ్ అదానీ కుమారుడిని వివాహం చేసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా ట్వీట్ చేశారు.
సిరిల్ ష్రాఫ్ సెబీ కమిటీలో కార్పొరేట్ గవర్నెన్స్,ఇన్‌సైడర్ ట్రేడింగ్ విభాగంలో పనిచేస్తున్నారని, సెబీ ఇండియా అదానీ కేసును విచారిస్తే, సిరిల్ ష్రాఫ్ ను ఆయా బాధ్యతలనుంచి తప్పించాలని, ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళు అక్రమాలను పాల్పడుతున్నారని ఆమె వెల్లడించారు.