Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,25 సెప్టెంబర్ 2024: ప్రముఖ ఇన్సూర్‌టెక్ కంపెనీ టర్టిల్‌మింట్ తాజాగా తమ 3.5 లక్షల మంది సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ల డెమోగ్రాఫిక్ వివరాలను వెల్లడించింది. ఈ విశ్లేషణలో, బీమా సేల్స్‌లో యువతరం ప్రభావం గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని వెల్లడించారు.

మొత్తం అమ్మకాలలో 85% కు పైగా జెన్ జెడ్ (1997 తర్వాత జన్మించిన వారు),మిలీనియల్స్ (1981 తర్వాత జన్మించిన వారు) ఆధిపత్యం వహిస్తున్నారు. గత ఏడాది రూ. 2,000 కోట్ల ప్రీమియంలను ఫెసిలిటేట్ చేసిన టర్టిల్‌మింట్, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ యువ అడ్వైజర్ల భాగస్వామ్యంతో మునుపెన్నడూ లేని స్థాయిలో మార్కెట్లో పటిష్టతను ప్రదర్శిస్తోంది.

టర్టిల్‌మింట్ గణాంకాల ప్రకారం, యువతరం అడ్వైజర్లు తమ వ్యాపారాన్ని డిజిటల్ విధానాలను ఉపయోగించి మరింత విస్తరిస్తున్నారు. జెన్ జెడ్ లో 78% మంది, మిలీనియల్స్ లో 74% మంది వ్యాపార కార్యకలాపాలను ఎక్కువగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. మారుమూల ప్రాంతాల్లో బీమా సేవలను విస్తరించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణలో సైతం యువతరం ఆధిపత్యం చూపుతుంది. ఇక్కడ టర్టిల్‌మింట్ సర్టిఫైడ్ అడ్వైజర్లలో 75.9% మంది జెన్ జెడ్, మిలీనియల్స్ ఉంటున్నారని కంపెనీ వెల్లడించింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ కొత్త తరానికి బీమా రంగంలో స్థిరత,సుదీర్ఘ కాలం పనిలో కొనసాగడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. టర్టిల్‌మింట్ సహ వ్యవస్థాపకుడు. సీఈఓ ధీరేంద్ర మహ్యావంశీ మాట్లాడుతూ, “యువతరం ద్వారా బీమా అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ పరివర్తన బీమా రంగంలో కీలకమని ఈ డేటా తెలియజేస్తుంది. మా భాగస్వాములు, కస్టమర్లకు మారుతున్న అవసరాలను తీర్చే వినూత్న సొల్యూషన్స్ అందించడంలో మేము కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.

పరిశ్రమపై యువతరం ప్రభావం

తమ సాంకేతిక నైపుణ్యాలతో ప్రస్తుత తరం అడ్వైజర్లు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ను పునర్నిర్వచిస్తూ, బీమా రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతున్నారు. ఒకప్పుడు సంక్లిష్టమైన కెరియర్ గా భావించిన బీమా, ఇప్పుడు క్రియాశీలకమైన ఆర్థిక సాధనంగా అభివృద్ధి చెందుతోంది.

టర్టిల్‌మింట్ యాప్ టర్టిల్‌మింట్‌ప్రో ద్వారా అడ్వైజర్లకు డిజిటల్ సాధనాలు, శిక్షణ, సర్టిఫికేషన్ అందించడం ద్వారా వారికి బలం చేకూరుస్తూ ముందుకు సాగుతోంది.

error: Content is protected !!