365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్ట్ 1,2025: తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించేలా రూపొందిన ‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ ఆగస్ట్ 8న ZEE5 ఓటీటీలో ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ-లవ్ డ్రామా సిరీస్‌కు శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సిరీస్ నుంచి శుక్రవారం విడుదలైన తొలి లవ్ సాంగ్ ‘గిబిలి గిబిలి’ శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు చరణ్ అర్జున్ సంగీతం అందించగా, మల్లెగోడ గంగ ప్రసాద్ సాహిత్యం రచించారు. జెనెరేషన్ Zను టార్గెట్ చేస్తూ, ట్రెండీ పదాలతో పాటను రూపొందించారు. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య చిలిపి ప్రేమకథ ముచ్చటగా కనిపిస్తుంది.

గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సిరీస్‌లో ఆద్యంతం హాస్యం, భావోద్వేగాల మేళవింపు కనిపించనుంది. కథ ప్రకారం, అర్పల్లి గ్రామానికి చెందిన పర్షి అనే యువకుడి ప్రేమ ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. అయితే, ఇరు గ్రామాల మధ్య చోటుచేసుకునే భూ వివాదం వల్ల కథ నూతన మలుపులు తిరుగుతుంది.
Read This also…“Ghibili Ghibili” Song from Mothevari Love Story Out Now; Series on ZEE5 from Aug 8..
సిరీస్‌కు శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ, అనిల్ గీలా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 7 ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ZEE5లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ZEE5 విషయానికి వస్తే…
ఇది భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. దేశవ్యాప్తంగా 12 భాషల్లో ప్రసారం అవుతున్న ఈ ఓటీటీ ద్వారా ఇప్పటివరకు 3,500కిపైగా సినిమాలు, 1,750 టీవీ షోస్, 700 ఒరిజినల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వినోదంతో పాటు ఎడ్యుకేషన్, న్యూస్, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లోనూ కంటెంట్ అందిస్తోంది.