Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, అక్టోబర్ 1, 2024: పరిశోధన-ఆధారిత, గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ,హృదయ సంబంధ వ్యాధుల నిర్వహణలో అగ్రగామిగా ఉన్న గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (గ్లెన్‌మార్క్) ఈ రోజు గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద “టేక్ ఛార్జ్ @18” ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ హైపర్‌టెన్షన్ అవగాహన కార్యక్రమం 18 సంవత్సరాల వయస్సు నుంచే రక్తపోటు పర్యవేక్షణ ప్రాముఖ్యతను గుర్తించడం లక్ష్యంగా ఉంది.

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపిఐ) ప్రతీ నెల 18వ తేదీన “టేక్ ఛార్జ్ @18 – బిపి స్క్రీనింగ్ డే”గా నిర్దేశిస్తూ, ప్రజలను గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి క్రమంగా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని ప్రోత్సహిస్తోంది.

గ్లెన్‌మార్క్, ఈ కార్యక్రమం ద్వారా 10 కోట్ల మంది భారతీయులకు రక్తపోటు గురించి అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం, 50 యూత్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించి, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, bpincontrol.com, సోషల్ మీడియా,ఇన్‌ఫ్లుయెన్సర్ భాగస్వామ్యాల ద్వారా 10 మిలియన్లకు పైగా వ్యక్తులను చేరుకోవడం, 900కు పైగా హైపర్‌టెన్షన్ అవేర్‌నెస్ ర్యాలీలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోనుంది.

ఈ ప్రచారం గురించి గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియా ఫార్ములేషన్స్ ప్రెసిడెంట్,బిజినెస్ హెడ్ అలోక్ మాలిక్ మాట్లాడుతూ, “మేము భారతదేశంలో హైపర్‌టెన్షన్‌పై అవగాహన కల్పించడానికి,అర్ధవంతమైన ప్రభావాన్ని చూపడానికి కట్టుబడి ఉన్నాము. హైపర్‌టెన్షన్ కేసులు, యువతలో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి.

కాబట్టి ప్రారంభంలోనే నివారణ చర్యలను తీసుకోవడం అవసరం. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపిఐ)తో కలసి ప్రారంభించిన ఈ ప్రచారం, సరైన రక్తపోటు నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సంరక్షణ నిపుణుల నైపుణ్యం వినియోగించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని పేర్కొన్నారు.

error: Content is protected !!