365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 29,2025 : దేశంలో ప్రీమియర్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ చికిత్సా కేంద్రంగా పేరుగాంచిన ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా సంస్థ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ‘ఫిజిటల్’ (ఫిజికల్+డిజిటల్) అనుభవాలను మిళితం చేస్తూ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఐవీఎఫ్ విజయాల రేటును సాధ్యం చేయడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది.
సమగ్ర సేవలందించే ప్లాట్‌ఫామ్..
ఈ వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏఆర్‌టీ క్లినిక్స్ తమ రోగులకు ప్రత్యేకమైన, ఉచిత సేవలను అందిస్తుంది. వీటిలో:
ల్యాబ్ సందర్శన: ఎంపిక చేసిన దంపతులకు ప్రతి శనివారం అత్యాధునిక ఎంబ్రియాలజీ ల్యాబ్‌ను ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈ టూర్‌లో అధునాతన టెక్నాలజీ, ఎంబ్రియో ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆర్ఐ విట్‌నెస్ టెక్నాలజీ గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

లైవ్ యోగా సెషన్లు: ప్రతి శనివారం ఆన్‌లైన్‌లో ఉచిత లైవ్ ఫెర్టిలిటీ యోగా సెషన్లను అందిస్తుంది. ఇందులో తేలికైన యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి నేర్పిస్తారు.
నిపుణుల వెబ్‌నార్లు: ప్రతి శుక్రవారం ఐవీఎఫ్ నిపుణులతో ఉచిత వెబ్‌నార్లు నిర్వహిస్తుంది. దీని ద్వారా కొత్త దంపతులు తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు.
తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ ప్యాకేజీలు: సమగ్ర ఫెర్టిలిటీ స్క్రీనింగ్ ప్యాకేజీలను కేవలం ₹1,199 నుంచి అందిస్తోంది.
Read This also…ART Fertility Clinics Launches Digital IVF Care in Telangana..
“విజ్ఞానం, నమ్మకమే మా లక్ష్యం” – గురుసిమ్రన్ కౌర్..
ఈ నూతన ఆవిష్కరణపై ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా ప్రాంతీయ అధిపతి గురుసిమ్రన్ కౌర్ మాట్లాడుతూ.. “ప్రారంభం నుంచీ రోగులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.

మా కొత్త వెబ్‌సైట్ ఆవిష్కరణ ఆ దిశగా మరో ముందడుగు. తద్వారా జ్ఞానంలో ఉన్న అంతరాలను తొలగించి, రోగులందరిలో నమ్మకం కల్పించి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తాం” అని తెలిపారు. ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్ భారతదేశంలో ఫెర్టిలిటీ కేర్‌ను మరింత చేరువగా, తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
మరిన్ని వివరాలకు https://artfertilityclinics.in/ ను సందర్శించవచ్చు.