Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 24,2024 :గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఓ వైపు అభిమానులు, మ‌రోవైపు సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గేమ్ చేంజ‌ర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్య‌రామ్ మూవీస్ సంస్థ‌లు త‌మిళంలో విడుద‌ల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు.

ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు నెక్ట్స్ రేంజ్‌లో సినిమా ఉండేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ‘జరగండి’, ‘రా మచ్చా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు మూడో పాటను రిలీజ్ చేయబోతోన్నారు.

న్యూజిలాండ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై షూట్ చేసిన ఈ మెలోడీ గీతాన్ని నవంబర్ 28న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు అప్డేట్ ఇస్తూ వదిలిన పోస్టర్లో రామ్ చరణ్, కియారా ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు.

డిసెంబ‌ర్ 21న అమెరికాలో చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా నిర్వహించబోతోన్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ టీజర్‌తో అంచనాలు పెంచిన చిత్రయూనిట్ మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది.

రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు.  కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.యు.వెంక‌టేశ‌న్‌, వివేక్ రైట‌ర్స్‌గా వ‌ర్క్ చేశారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

న‌ర‌సింహా రావు.ఎన్, ఎస్‌.కె.జ‌బీర్‌ లైన్ ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా అవినాష్ కొల్ల‌, యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అన్బ‌రివు, డాన్స్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌భుదేవా, గ‌ణేష్ ఆచార్య‌, ప్రేమ్ రక్షిత్‌, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వ‌ర్క్ చేస్తున్నారు.

రామ్ జోగ‌య్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్ పాట‌ల‌ను రాశారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది.

ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల.

error: Content is protected !!