365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 12,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉండగా, మొదటి రోజు ‘గేమ్ ఛేంజర్’ వరల్డ్‌వైడ్‌గా రూ.186 కోట్ల వసూళ్లను సాధించి పెద్ద హిట్‌గా నిలిచింది.
అయితే, ఈ చిత్రంలో మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట కనపడకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సాంకేతిక కారణాల వల్ల పాట జోడించలేకపోయామని చిత్రయూనిట్ స్పష్టం చేసింది.

కానీ, ఇప్పుడు ఈ పాటను థియేటర్లో చూడవచ్చు అని చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ పాటను ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించడంతో, ప్రేక్షకులకు దాదాపు ఐ ఫీస్ట్ అనిపించనుంది.
రామ్ చరణ్ ఈ చిత్రంలో రామ్ నందన్,అప్పన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. స్టైలిష్ పాత్రలతో పాటు, పెర్ఫామెన్స్‌లో కూడా అందరినీ ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, సహజమైన నాట్యాలు, అలాగే చరణ్-ఎస్.జె. సూర్య మధ్య ఉన్న ఎగ్జయిటింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రామ్ చరణ్-కియారా అడ్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీకు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
శంకర్ తనదైన శైలిలో ‘గేమ్ చేంజర్’ సినిమాను ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్, బ్యాగ్రౌండ్ స్కోర్, తిరు అద్భుతమైన విజువలైజేషన్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి.

ఈ సినిమా శ్రీమతి అనిత సమర్పణలో, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.