365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,జనవరి14,2022: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం గోదా రంగనాథ కల్యాణం ఘనంగా ముగిసింది. నెల రోజుల తిరుప్పావై ప్రవచనం ముగిసింది. వేదికపై శ్రీ రంగనాథ స్వామి, గోదా దేవి ఆసీనులు కాగా, అర్చకులు గోదా కల్యాణం చేస్తూ శ్లోకాలను పఠించారు.

టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డాక్టర్ సీ రంగనాథన్‌ నిర్వహించే తిరుప్పావై పాసుర ప్రవచనం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమ అధికారి ఎల్ విజయసారధి, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పురుషోత్తం, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.