Godrej Appliances launches wide range of Air Conditioners - Real Estate  Guru | Regnews

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,ఫిబ్రవరి 28,2022 : గోద్రేజ్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీ గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ తమ వ్యాపార విభాగం గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ఇప్పుడు తమ ప్రీమియం శ్రేణి ఎయిర్‌ కండీషనర్లను అత్యాధునిక కూలింగ్‌,ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ టెక్నాలజీ, ఐఓటీ కంట్రోల్స్‌, వైవిధ్యమైన ఆకర్షణ,మరెన్నో ఫీచర్లతో విడుదల చేసింది.ఈ ఎయిర్‌ కండీషనర్లు సాంకేతికత పట్ల అమితాభిరుచి కలిగిన వినియోగదారుల కోసం స్మార్ట్‌ కంట్రోల్స్‌ అందించడంతో పాటుగా ఐఓటీ, యువీ సాంకేతికత, నానో కోటెడ్‌ యాంటీ వైరల్‌ ఫిలే్ట్రషన్‌ వంటి వాటిని సైతం అందిస్తుంది.

ఇంటర్నెట్‌ వేగంగా విస్తరిస్తుండటం,స్మార్ట్‌ఫోన్లను విరివిగా వినియోగిస్తుండటం వల్ల వినియోగదారుల ప్రవర్తనలో సైతం గణనీయమైన మార్పులు వచ్చాయి,మహమ్మారి కారణంగా డిజిటల్‌ అవగాహన విస్తృతంగా పెరిగింది. ఈ కారణం చేత సాంకేతిక ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్‌ సైతం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ ఏసీల కోసం
పెరుగుతున్న డిమాండ్‌ తీర్చే రీతిలో గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ తమ పూర్తి సరికొత్త గోద్రేజ్‌ ఇయాన్‌ డీ సిరీస్‌ ఎయిర్‌ కండీషనర్లను పరిచయం చేసింది.

Godrej Appliances launches wide range of Air Conditioners - Real Estate  Guru | Regnews

ఈ నూతన సాంకేతికతలను ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మోడల్స్‌లో సైతం పరిచయం చేయనున్నారు. ఈ స్మార్ట్‌ ఎయిర్‌ కండీషనర్లు వై–ఫై ఆధారితం. ఈ ఏసీలు అలెక్సా,గుగూల్‌ హోమ్‌ అనుకూలతలతో వాయిస్‌ ఆధారితంగా కూడా పనిచేస్తాయి. వీటిని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించి ఇతర ప్రాంతాల నుంచి సైతం నిర్వహించవచ్చు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఉష్ణోగ్రత
నియంత్రించడం,ఫ్యాన్‌ వేగం పెంచడం,మోడ్‌ సెట్టింగ్‌, టైమ్‌ షెడ్యూల్‌ చేసుకోవడం తో పాటుగా ఏసీ స్ధితిని సైతం అతి సులభంగా నిర్వహించవచ్చు.

రిమోట్‌ షెడ్యూలింగ్‌,పర్యవేక్షణ ద్వారా సౌకర్యమూ,సౌలభ్యమూ పెంపొందించడం లక్ష్యంగ చేసుకుంది.వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తి ఏదైనా ఆరోగ్యం , పరిశుభ్రత అంశాలపై ఈ మహమ్మారి గణనీయమైన ప్రభావాన్ని చూపింది. పూర్తి సరికొత్త యువీ కూల్‌ టెక్నాలజీని గోద్రేజ్‌ ఏసీలలో జొప్పించడం వల్ల గాలితో పాటుగా ఏసీలు ఉన్న గదిలో ఉపరితలాలైనటువంటి ఫ్యాబ్రిక్‌, చెక్క, లోహం వంటి వస్తువుల ఉపరితలాలను క్రిమిసంహారక చేయడంలో సహాయపడుతుంది. యువీ మాడ్యుల్‌ను ఏసీ లోపల ఎవాపరేటర్స్‌ పై అమర్చారు. ఇది యువీసీ కిరణాలను 260–275 ఎన్‌ఎంను ప్రసరిస్తుంది. యువీ మాడ్యుల్‌ నుంచి వెలువడే గరిష్ట వేవ్‌లెంగ్త్‌ ఇది.

ఈ వేవ్‌లెంగ్త్‌తో 99.99% వైరల్‌ పార్టికల్స్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌,ఇతర పాతోజెన్స్‌ను ఎవాపరేటర్‌ ఉపరితలంపై నుంచి నాశనం చేయవచ్చు. అంతేకాదు, నానో కోటెడ్‌ యాంటీ వైరల్‌ ఫిల్టర్‌ 99.9% వైరల్‌ పార్టికల్స్‌ను గాలి నుంచి తొలగించి వినియోగదా రులకు భద్రతను అందిస్తుంది.అదనంగా, హెవీ డ్యూటీ రోటరీ ఇన్వర్టర్‌ కంప్రెసర్‌ తో పాటుగా ఎలకా్ట్రనిక్‌ ఎక్స్‌పాన్షన్‌ వాల్వ్‌,అత్యున్నత డిజైన్‌ తక్కువ డీరేటింగ్‌తో పాటుగా వేగవంతమైన,సమర్థవంతమైన శీతలీకరణను అందిస్తుంది. ఇది 52
డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద కూడా చల్లదనంను అందిస్తుంది. ఈ ఏసీలు ఆర్‌290 ,ఆర్‌ 32 రిఫ్రిజిరెంట్ల సమ్మేళనంతో లభ్యమవుతాయి.

Godrej Appliances launches wide range of made in India Air Conditioners  with Smart IOT controls, 99.9% UV virus sterilization, advanced cooling,  and more

ఇవి పర్యావరణ అనుకూలంగా ఉండటంతో పాటుగా జీరో ఓజోన్‌ డిప్లీషన్‌ సామర్థ్యంతో ,అతి తక్కువ గ్లోబల్‌ వార్మింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ ఉత్పత్తి ఆవిష్కరణ గురించి కమల్‌నంది,బిజినెస్‌ హెడ్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – గోద్రేజ్‌
అప్లయెన్సెస్‌, గోద్రేజ్‌ అండ్‌ బాయ్‌సీ విభాగం మాట్లాడుతూ ‘‘ మా ‘థింగ్స్‌ మేడ్ థాట్‌ఫుల్లీ’ సిద్ధాంతానికి అనుగుణంగా మేము నూతన తరపు సాంకేతికతలను వినియోగించుకుంటూ అత్యుత్తమ శ్రేణి పరిష్కారాలను మా వినియోగదారులకు అందిస్తున్నాము. మా దేశీయ తయారీ విస్తరణ ఇప్పుడు విస్తృత స్థాయిలో ఏసీల జాబితాను మా వినియోగదారులకు అత్యుత్తమ డిజైన్‌ అంశాలతో అందించేందుకు తోడ్పడుతుంది.

2021 వేసవిలో ఏసీల అమ్మకాలు 2020 వేసవి కంటే ఉత్తమంగా ఉన్నాయి. అయితే, వ్యాపారపరంగా మాత్రం కోవిడ్‌ ముందునాటి స్ధాయిలను అందుకోలేదు. మూడోవేవ్‌ దాదాపుగా ముగియడం, అత్యధికశాతం ప్రజలకు టీకాలు అందుబాటులోకి రావడంతో పాటుగా వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో ఈ వేసవిలో మా ఏసీల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉండవచ్చని భావిస్తున్నాం’’ అని అన్నారు.గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ప్రోడక్ట్‌ గ్రూప్‌ హెడ్‌ సంతోష్‌ సలీయన్‌ మాట్లాడుతూ ‘‘స్మార్ట్‌ ఎయిర్‌ కండీషనర్లు,ఆరోగ్య, పరిశుభ్రతా విభాగంలో మా ప్రవేశం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భవిష్యత్‌లో సిద్ధంగా ఉన్న
ఉత్పత్తులను అందించడం ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చాలనే మా నిబద్ధతకు నిదర్శనం.

Godrej Appliances launches wide range of made in India Air Conditioners  with Smart IOT controls, 99.9% UV virus sterilization, advanced cooling and  more | Global Prime News

ఈ వేసవిలో,21 నూతన ఇన్వర్టర్‌ స్ల్పిట్‌ ఏసీలు అందించడానికి మేము సిద్ధమయ్యా ము.ఇవన్నీ కూడా అత్యంత శక్తివంతమైన కూలింగ్‌ను అందిస్తాయి. వీటితో పాటుగా ఈ ఏసీలలో నానో కోటెడ్‌ యాంటీ వైరల్‌ ఫిల్టర్‌,యువీసీ సాంకేతికత,ఐఓటీ ఆధారిత స్మార్ట్‌ కంట్రోల్స్‌ , అత్యధిక ఐఎస్‌ఈఈఆర్‌తో అత్యంత సమర్థవంతమైన ఏసీలు, మన్నిక,ఆకర్షణీయతను కలిగి ఉన్నాయి’’ అని అన్నారు.గోద్రేజ్‌ ఇయాన్‌ డీ సిరీస్‌ ఎయిర్‌ కండీషనర్లు వైట్‌, కాపర్‌,రోజ్‌ గోల్డ్‌ రంగుల అవకాశాలలో ఈ–కామర్స్‌
వేదికల వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలో లభ్యమవుతాయి.