365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, జూన్ న 4,2024: గోద్రెజ్ & బాయిస్ వ్యాపార విభాగమైన గోద్రెజ్ అప్లయెన్సెస్ పుణెలోని పిరంగుట్‌లో ఉన్న తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించింది. ఆర్&డీ సెంటర్ అనెక్స్‌ను గోద్రెజ్ అండ్ బాయిస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జంషీద్ ఎన్. గోద్రెజ్ ప్రారంభించారు.

బ్రాండ్, ఇన్‌హౌస్ డెవలప్‌మెంటల్, టెస్టింగ్ ల్యాబ్‌ల ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు స్థాయికి మించి పెంచుకోవడమనేది ఈ వ్యూహాత్మక విస్తరణ లక్ష్యం. నవకల్పనల ఆవిష్కరణ, నాణ్యత, సాంకేతిక పురోగతిని పటిష్టపర్చుకోవడంలో కంపెనీకి గల నిబద్ధతను మరింత పటిష్టపర్చుకునేందుకు ఇది తోడ్పడగలదు.
కొత్తగా 43,000 చ.అ.ల విస్తీర్ణంలో విస్తరించిన ఆర్&డీ కేంద్రంతో బ్రాండ్ తన ఆర్&డీ సిబ్బంది సంఖ్యను కూడా రెట్టింపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రోడక్టులను అభివృద్ధి చేసే ప్రక్రియలు మరింత సమర్ధమంతంగా, పటిష్టంగా అయ్యేందుకు NABL అక్రెడిటెడ్ ప్రయోగశాలలు, అత్యంత ఆధునిక మౌలిక సదుపాయాలు దోహదపడగలవు.
వినియోగదారులకు అధునాతనమైన, అలాగే ఇంధనాన్ని ఆదా చేసే ఉత్పత్తులను అందించాలన్న గోద్రెజ్ దీర్ఘకాలిక వ్యూహానికి ఈ విస్తరణ తోడ్పడగలదు. పర్యావరణానికి అనుకూలమైన విధంగా ఈ భవనం నిర్మించబడింది.

దీన్ని సాధ్యమైనంత వరకు సహజసిద్ధమైన కాంతిని వినియోగించుకునేలా నిర్మించడం వల్ల విద్యుత్ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి. పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు, నేర్చుకునేందుకు, తమ పరిజ్ఞానాన్ని మిగతావారితో పంచుకునేందుకు అనువుగా ఉండేలా ఈ కేంద్రం తీర్చిదిద్దబడింది.
ఈ కొత్త తరం ఆఫీస్ డిజైన్ వేడుకగా విధులను నిర్వర్తించుకోవడాన్ని, పారదర్శకతను ప్రోత్సహించే విధంగా ఉంటుంది.
“ప్రోడక్ట్‌ను అభివృద్ధి చేయడమనేది మా బ్రాండ్‌కి వెన్నెముకలాంటిదని గోద్రెజ్ అప్లయెన్సెస్ విశ్వసిస్తుంది. అందుకే నవకల్పనలను ప్రోత్సహించేందుకు ఆర్&డీపై మేము గణనీయంగా పెట్టుబడులు పెట్టాం. ఇవి మా విజయానికి కీలకంగా ఉండగలవని విశ్వసిస్తున్నాం. మా ఆర్&డీ కేంద్రం విస్తరణనేది ఈ నమ్మకం పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ ఆర్&డీ కేంద్రం ఏర్పాటుతో పిరంగుట్‌లో ఆర్&డీపై మా సంచిత పెట్టుబడులు దాదాపు రూ. 100 కోట్ల స్థాయికి చేరినట్లవుతుంది. మా కస్టమర్ల మారుతున్న అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఉత్పత్తులను అందించాలన్న మా అంకితభావానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
మా ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు నిర్దేశించుకునే గడువులను వేగవంతంగా అందుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో మార్కెట్లో మరింత అధునాతనమైన ఉపకరణాలను ప్రవేశపెట్టేందుకు ఈ విస్తరణ ఉపయోగపడగలదు” అని గోద్రెజ్ & బాయిస్‌లో భాగమైన గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు.
