365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, డిసెంబర్ 4,2024: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (జీఐజీ) ప్రఖ్యాత ఫుడ్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ గోద్రెజ్ విఖ్రోలి క్యూసినా, ఫుడ్ బ్లాగర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌బీఏఐ)తో కలిసి సెవెన్ రివర్స్, తాజ్ హాలిడే విలేజ్, గోవాలో ఇండియా ఫుడ్ & బెవరేజ్ అవార్డ్స్ (IFBA) 2024ను ఘనంగా నిర్వహించింది.

ఈ అవార్డ్స్, భారతదేశపు విభిన్న ఆహార సంస్కృతిని జరుపుకుంటూ, ఆహారం ,పాకశాస్త్ర రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను గౌరవించేందుకు ప్రత్యేకంగా రూపొందించాయి.

ఈ వేడుకలో చెఫ్ సంజ్యోత్ కీర్, చెఫ్ సబ్యసాచి గోరాయ్, ,కళ్యాణ్ కర్మాకర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా, చెఫ్ సంజ్యోత్ కీర్‌కు “ఔట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు హాస్పిటాలిటీ అండ్ కలినరీ ఇండస్ట్రీ” అవార్డు లభించింది. ఎఫ్‌బీఏఐ స్టార్‌గా కళ్యాణ్ కర్మాకర్ ఎంపికవ్వడం విశేషం.

అవార్డుల విశిష్టత

IFBA 2024లో 33 ఉపవిభాగాల ద్వారా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, బ్లాగింగ్, యూట్యూబ్, హాస్పిటాలిటీ, పబ్లిక్ ఓటింగ్ తదితర విభాగాల్లో ప్రతిభ గల 155 మంది విజేతలు సత్కరించబడ్డారు. ఈ అవార్డ్స్, భారత ఆహార పరిశ్రమలో ట్రెండ్ సెట్ చేస్తున్న సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచాయి.

గోద్రెజ్ జెర్సీ, గోద్రెజ్ యమ్మీజ్, గోద్రెజ్ రియల్ గుడ్ చికెన్ వంటి గోద్రెజ్ యాజమాన్య బ్రాండ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించాయి. జెర్సీ యోగర్ట్ వాల్, జెర్సీ స్వీట్ షాక్ వంటి ప్రత్యేక ఇన్‌స్టాలేషన్లు, ఆహార సమాజానికి ప్రత్యేక అనుభవాలను అందించాయి.

గోద్రెజ్ యమ్మీజ్ నిర్వహించిన భారతదేశపు ఫ్రోజెన్ స్నాక్స్ నివేదిక STTEM 2.0 ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. ఈ నివేదికలో, భారతదేశంలో పెరుగుతున్న స్నాకింగ్ ట్రెండ్‌లను విశ్లేషిస్తూ, వినియోగదారుల అభిరుచుల మార్పులపై దృష్టి సారించారు.

గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ సీఈఓ అభయ్ పర్నేర్కర్ మాట్లాడుతూ, “భారతీయ స్నాకింగ్ సంస్కృతిని మేల్కొల్పే ఈ నివేదికను IFBA 2024 వేదికగా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. స్నాక్స్, ఆహార ప్రపంచంలో కేవలం అల్పాహారంగా కాకుండా, ఒక అనుభవంగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు.

గోద్రెజ్ కార్పొరేట్ బ్రాండ్ & కమ్యూనికేషన్స్ చీఫ్ సుజిత్ పాటిల్ మాట్లాడుతూ, “భారతదేశపు వంట ప్రపంచంలో కొత్త సృష్టికి మా వేదికగా విఖ్రోలి క్యూసినా నిలుస్తోంది. ఈ విజయాలు మా మిషన్‌ను ముందుకు తీసుకువెళ్లే స్ఫూర్తిగా మారతాయి” అని తెలిపారు.

ఈ కార్యక్రమం భారతీయ ఆహార పరిశ్రమలో నూతనదిశలను నిర్దేశిస్తూ, ఆహార ప్రియులకు, ఆహార ప్రొఫెషనల్స్‌కి మరింత ప్రేరణనిచ్చేలా నిలిచింది.