365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 1,2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేణు గోపాలస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 7వ తేదీ గోకులాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వీధి ఉత్స‌వం, 8 గంటలకు స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.