365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఆగస్టు 25,2021:ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని శ్రీ సీతమ్మవారికి కర్నూల్‌కు చెందిన సి.పుల్లారెడ్డి బుధవారం ఉదయం రూ.1.85 లక్షల విలువ గల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు.
ఆలయ ఏఈవో మురళీధర్‌కు దాత హారాన్ని అందజేశారు. అనంతరం హారానికి పూజలు నిర్వహించి, అమ్మవారికి అలంకరించారు.