365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 3, 2024: రాష్ట్రంలో బంగారం ధరలు ఎప్పుడు లేని విధంగా రికార్డులు బద్దలుకొడుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా ధరలు మరింతగా పెరిగి, త్వరలోనే 57,000కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రూ.80 పెరుగుదలతో బంగారం ధర రూ.56,880కి చేరి సరికొత్త గరిష్టాన్ని తాకింది. గ్రాముకు రూ.10 పెరగడంతో, ప్రస్తుతం ఒక్క గ్రాము బంగారం ధర రూ.7,110గా ఉంది.

గత మూడు రోజుల క్రితం రికార్డు స్థాయిలో రూ.56,800 వద్ద నిలిచిన బంగారం ధర మధ్యలో రూ.400 వరకు తగ్గినా, నిన్నటి నుంచి ధర మళ్లీ కోలుకోవడం ప్రారంభించింది. గత వారం నుంచి ప్రతి రోజూ ధరలు కొత్త గరిష్టాలను చేరుతుండగా, 55,120 వద్ద నమోదైన పాత రికార్డును బద్దలుకొట్టి, ధరలు మరింత పుంజుకుంటున్నాయి.