365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 24,2025 :దివ్య సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్య జనని యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది.

స్వామి వివేకానంద ప్రాక్టికల్ వేదాంత, జ్ఞాన యోగ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలెడ్జ్ స్ట్రెంత్ అనే పుస్తకంపై టెస్ట్ నిర్వహించనుంది. మాక్ టెస్ట్ జూలై 20న జరగనుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

ఆర్యజనని వెబ్సైట్ https://aaryajananicontests.org/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డాక్టర్ అనుపమ రెడ్డి తెలిపారు. https://aaryajananicontests.org/login/signup.php. మెయిన్ క్విజ్ ఆగస్టు మూడున జరగనుంది. విజేతలైన 150 మంది యువతీ యువకులకు ఆకర్షణీయ స్కాలర్షిప్పులు అందిస్తామన్నారు.

మరిన్ని వివరాలకు 8977863881 నెంబర్ కు వాట్సాప్ చేయాలని సూచించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం లోని వివేకానంద హెల్త్ సెంటర్‌లో సేవలందిస్తున్న ప్రత్యేక వైద్యుల బృందం 2018 సంవత్సరంలో ఆర్యజనని ప్రారంభించింది.

Read This also…IndiGo Launches “Monsoon Sale” with Attractive Fares and Add-on Discounts

Read This also…Supertech EV to Raise Rs.29.90 Crore via SME IPO; Public Issue Opens on June 25, 2025..

ఇది కూడా చదవండి…50 ఏళ్ళ ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్యంపై దండయాత్ర చేదు జ్ఞాపకాలు..!

Read This also…Suzlon Secures Third Consecutive 170.1 MW Order from AMPIN Energy to Accelerate India’s Green Power Transition

అనేక మంది ఉత్సాహవంతులైన, సేవాభావతత్పరులైన వైద్యులు, యోగా నిపుణులు, క్లినికల్ సైకాలజిస్టులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, గాయకులు ఆర్యజనని బృందంలో ఉన్నారు.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా గత 5 సంవత్సరాలుగా, ఆర్యజనని సంస్థ, కాబోయే తల్లి తండ్రులకు “స్పృహతో కూడిన గర్భధారణ, పేరెంటింగ్” గురించి అవగాహన కల్పించే విధంగా ఆఫ్ లైన్, ఆన్ లైన్ వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది.

ఇది గర్భిణీ స్త్రీలు, వారి శిశువుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమము. యోగా, ధ్యానం, బేబీ బాండింగ్ టెక్నిక్స్, ఆత్మీయ గానం, ప్రెగ్నెన్సీ లైఫ్ స్టైల్ తదితర అంశాలతో కూడిన ఈ 3 గంటల వర్క్ షాప్ ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానంతో కూడిన అద్భుతమైన మేళవింపు. కడుపులో పెరుగుతున్న శిశువు శారీరక, భావోద్వేగ, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఉన్నతికి ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది.