Mon. Dec 23rd, 2024
healthy-fruits

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 11,2022: గ్యాస్ ట్రబుల్..ప్రస్తుత తరంలో వీళ్ళు, వాళ్ళు అని తేడా లేకుండా పిల్లల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. తిన్నా.. తిన‌క‌పోయినా..గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

దీంతో ఎలాంటి ఆహారం తిన‌లేక‌ ఇబ్బందిపడుతున్నారు కొందరు. అయితే ఈ సమస్య కు సరైన పరిష్కారం ఉంది. కొన్నిరకాల పండ్లు తినడంద్వారా ఆయా సమస్య నుంచి బయటపడొచ్చు..అవేంటంటే..?

healthy-fruits

గ్యాస్ స‌మ‌స్య‌కు పుచ్చ‌కాయ‌లు చ‌క్క‌ని ప‌రిష్కారం అని చెప్ప‌వ‌చ్చు. వాటర్ మిలన్ లో అధిక శాతం నీరు, ఫైబ‌ర్ ఉంటాయి. కాబట్టి భోజ‌నం చేసిన త‌రువాత ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌లు తింటే వెంట‌నే గ్యాస్ ట్ర‌బుల్ నుంచి ఉపశమనం ల‌భిస్తుంది.

అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం అనేది అస్సలు ఉండ‌దు.

అర‌టి పండ్లు మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. కాబటికి వీటిని రోజూ తిన‌వ‌చ్చు. అర‌టిపండ్ల‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత ఒక గంటతర్వాత ఒక అర‌టి పండు తినాలి.

దీనీవల్ల పొట్ట‌లో ఉండే గ్యాస్ మొత్తం పోతుంది. పొట్ట తేలిగ్గా అవుతుంది. అంతేకాదు దేనివల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా దూరమవుతాయి.

కివీ పండ్ల‌లో విట‌మిన్ “సి” అధికంగా ఉంటుంది. ఫైబ‌ర్‌, పొటాషియం వంటి పోష‌కాలు కూడా వీటిల్లో ఎక్కువ‌గానే ఉంటాయి. అందువ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య నుంచి ఇవి రిలీఫ్ ను అందిస్తాయి.

భోజ‌నం అనంత‌రం ఒక కివీ పండును తిన‌డం వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

healthy-fruits

కీర‌దోస కూడా గ్యాస్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. వీటిలోనూ నీరు అధికంగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ ప్రాబ్లెమ్ సుల‌భంగా త‌గ్గిపోతుంది. పొట్ట ఉబ్బ‌రంతగ్గుతుంది.

స్ట్రాబెర్రీల‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, విట‌మిన్ సి, ఐర‌న్‌, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల భోజ‌నం అనంత‌రం వీటిని తింటే గ్యాస్ రాదు. ఇత‌ర జీర్ణ స‌మ‌స్య‌లు కూడా తలెత్తవు.

అంజీర్ పండ్ల‌లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఫైబ‌ర్ వీటిలో అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ స‌మ‌స్యను త‌గ్గిస్తుంది. రాత్రి భోజ‌నం చేశాక లేదా ఉద‌యం ప‌ర‌గ‌డుపునే 3-4 అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఏమీ ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అజీర్ణం వంటివి త‌గ్గుతాయి.

error: Content is protected !!