gold and silver rates
 Good news for Gold buyers

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 25, 2021: భారతీయ సంప్రదాయాల్లో బంగారు, వెండి ఆభరణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. ఈరోజు పసిడి ధర కొంతమేర దిగింది. నిన్న దిగొచ్చిన గోల్డ్ రేటు ఈరోజు కూడా తగ్గింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడిచి.. కొంతమేర దిగివచ్చింది.

 Good news for Gold buyers
Good news for Gold buyers

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Good news for Gold buyers
Good news for Gold buyers

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర రూ. 4360 లు ఉండగా రూ. 40తగ్గి ఈరోజు రూ. 4,320లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 43600 ఉండగా రూ. 400లు తగ్గి.. నేడు రూ. 43,200లు గా నమోదైంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,756లు ఉండగా నేడు రూ.43 తగ్గి ఈరోజు 4,713లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. నిన్న రూ. 47,560 లు ఉండగా.. నేడు రూ. 430 మేర తగ్గి నేడు 47,130 లకు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

వెండి ధరలు..

ఇవాళ వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. దీంతో వెండిని ధర స్వల్పంగా తగ్గింది. దీంతో శనివారం రోజున కిలో వెండి ధర రూ.64,900కు పడిపోయింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 200మేర తగ్గింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లలకు వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయం.